17.4 C
London
Thursday, July 16, 2026
Home తెలంగాణ ప్రజల కోసం “పల్లా టైమ్స్” వచ్చేసింది!

ప్రజల కోసం “పల్లా టైమ్స్” వచ్చేసింది!

0
  • సమాచారం కోసం ఇక ఎదురు చూపులే లేవు
  • ప్రజల చేతిలోనే సమాచారం…పల్లా టైమ్స్‌తో కొత్త అడుగు
  • వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao చేతుల మీదుగా వెబ్‌సైట్ ప్రారంభం
  • క్యూ ఆర్ స్కాన్‌తో వెంటనే అప్‌డేట్స్

జనగామ:

ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో జనగామ ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి రూపొందించిన “పల్లా టైమ్స్”(PALLA TIMES )వెబ్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను మంగళవారం జనగా మ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఘనంగా ప్రారం భించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామరావు ఎమ్మెల్యే కార్యాలయంలో వెబ్‌సైట్‌ను అధికారికంగా ఆవిష్కరించా  రు. అనంతరం పల్లా టైమ్స్‌కు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను తన మొబైల్‌లో స్కాన్ చేసి ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిం చారు. సాంకేతికతను వినియోగించి ప్రజలకు సమాచారం వేగంగా చేరవేయా లనే లక్ష్యంతో రూపొందించిన ఈ వెబ్‌  సైట్‌పై ఆయన అభినందనలు తెలిపారు.

ప్రతి అప్‌డేట్‌ను ప్రజలకు అందించేందుకే వెబ్‌సైట్: జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

పల్లా టైమ్స్ ద్వారా తాను చేపడుతున్న అభివృద్ధి కార్య క్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న పనులు, ప్రజా సమస్యల పరిష్కా రానికి తీసుకుంటున్న చర్యలు, అలాగే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్య  మని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇకపై నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఉన్నా తమ మొబైల్ లేదా కంప్యూ టర్ ద్వారా సులభంగా వెబ్‌సైట్‌ను సందర్శిం  చి తాజా సమాచారం తెలుసుకునే వీలు ఉంటుందని చెప్పారు. అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే వెబ్‌సైట్‌కు కనెక్ట్ అయి అప్‌డేట్స్ పొందే సౌకర్యం కల్పించామని వివరించారు. పోస్టర్‌లో ప్లాట్‌ఫామ్ లక్ష్యాలు, సేవలు, ప్రజ లకు అందించే సమాచారంపై స్పష్టమైన వివరాలు పొందు  పరిచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here