- ప్రజలకు ఇబ్బందులు లేకుండా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
- అధికారులతో సమీక్షించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం
- జనగామలో 39 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
- ముఖ్య అతిథిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనగామ పట్టణం, మండలానికి చెందిన కళ్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ (Distribution of cheques to beneficiaries of Kaly ana Lakshmi scheme)కార్యక్రమంలో జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మొత్తం 39మంది లబ్ధిదారులకు కళ్యా ణలక్ష్మి చెక్కులను అందజేసి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా గారి మీడియా పాయింట్స్:
- కళ్యాణలక్ష్మి చెక్కులు కొంతకాలంగా పెండింగ్‌లో ఉండ టాన్ని గుర్తించి, వాటిని త్వరితగతిన లబ్ధిదారులకు అందిం చేందుకు తాను ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు.
- ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయ అధికారులతో పలు మార్లు చర్చించి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు.
- అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు ఆలస్యం కాకుండా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించినట్లు తెలిపారు.
- ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బం దులు పడకూడదనే ఉద్దేశంతోనే తాను పాల్గొనే ప్రతి కార్య క్రమంలోనే కళ్యా ణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా చూడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
- కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ పథకం వల్ల పేద కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గడంతో పాటు వారికి ఆర్థిక భరోసా కలుగుతోందని తెలిపారు.

















