- యశ్వంతాపూర్‌లో రైతుల సమస్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం
జనగామ:
జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కలు కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president) పరిశీలించారు. అనంతరం ఆయన తీవ్రంగా స్పందించారు. గత 15రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రత్యక్షంగా తెలు సుకున్నారు.
రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం:
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. నాట్లు వేసేటప్పు డు రైతులు గుర్తు ఉండరు…ఓట్లు వేసేటప్పుడు మాత్రం గుర్తుకు వస్తారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, చివరికి ఆత్మహత్యల దిశగా నెట్టివేస్తు న్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం:
పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని రైతులు పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపో వడం శోచనీయమని కేటీఆర్ అన్నారు. అక్కడి నుంచే మార్క్‌ఫెడ్ ఎండీతో మాట్లాడి వెంటనే కొనుగోళ్లు ప్రారంభిం చాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
కొనుగోళ్లు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు:
రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధం చేసేలా భారీ ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

రైతులకు ధైర్యం చెప్పిన కేటీఆర్:
పండించిన పంటను మనమే కాపాడుకోవాలి…అందరూ ధైర్యంగా ముందుకు సాగాలి. అక్కడ కేసీఆర్, ఇక్కడ పల్లా ఉన్నారు అంటూ రైతులకు భరోసా ఇచ్చారు..

















