15.2 C
London
Monday, June 1, 2026
Home వ్యవసాయం 80 శాతం కోతలు పూర్తైనా ప్రభుత్వం కేవలం 25 శాతం ధాన్యమే కొనుగోలు చేసింది..!

80 శాతం కోతలు పూర్తైనా ప్రభుత్వం కేవలం 25 శాతం ధాన్యమే కొనుగోలు చేసింది..!

0
  • భారదన్, లారీలు లేవన్న నెపంతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది
  • వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ఒక్క కిలో ధాన్యం కూడా ఎత్తుకోలేదు
  • గ్రౌండ్ లెవల్‌లో లారీలు లేవని స్పష్టమవుతుంటే అధి కారుల ప్రకటనలు అబద్ధాలుగా మారాయి.
  • మిల్లర్లు ధాన్యం దించకపోయినా ప్రభుత్వం పట్టించు కోవడం లేదు.
  • రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే..
  • వరి ధాన్యం కొనుగోలు చేయలేని స్థితికి ప్రభుత్వం దిగజారింది
  • మార్కెట్లు మూసివేసి రైతులను రోడ్డున పడేసే పరిస్థితి తీసుకొచ్చారు
  • తడిసిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది 
  • కేసీఆర్ హయాంలో సమర్థంగా నడిచిన కొనుగోలు వ్యవస్థను ఈ ప్రభుత్వం నాశనం చేసింది
  • ప్రతి గింజ కొనుగోలు చేస్తామన్న హామీ గాలిలో కలిసిపోయింది
  • ఒక కోటి మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం మాటలకే పరిమితమైంది
  • పౌర సరఫరాల శాఖ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది
  • రైతు చెమటకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి విలువ లేకుండా పోయింది
  • వరి కొనుగోలు కేంద్రాల జాప్యంపై సీఎం నుంచి ఇప్పటివరకు సమాధానం లేదు

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి  

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం మీడియాతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA)మాట్లాడారు. ఈ సందర్బంగా వరి ధాన్య కొనుగోలు కేంద్రాల జాప్యంపై మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా పాయింట్స్:

  • జనగామ నియోజకవర్గంలో ప్రస్తుతం వరి ధాన్య సేకరణ పరిస్థితి రైతులకు తీవ్రమైన ఆందోళన కలిగించేలా ఉందన్నారు.
  • జనగామ మార్కెట్‌కు రెండు రోజుల సెలవులు ఇవ్వ డం జరిగింది. చేర్యాల మార్కెట్‌లో వారం రోజులుగా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వారం రోజులుగా ఒక్క కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.
  • కారణం ఏమిటని అడిగితే భారదన్ (గన్నీ బ్యాగులు) లేవు..లారీలు లేవు అని చెబుతున్నారు.
  • పై అధికారులతో మాట్లాడితే లారీలు పంపిస్తున్నామని, భారదన్‌కు ఇబ్బంది లేదని చెబుతున్నారు. కానీ గ్రౌండ్ లెవల్‌లో చూస్తే ఏ గ్రామంలోనూ 50 లా రీలకు మించి కనిపించడం లేదు.
  • ఇప్పుడే నాగిరెడ్డి పల్లి, కేసిరెడ్డి పల్లి, బచ్చన్నపేట, నర్మేట గ్రామాల రైతులతో మాట్లాడానని చెప్పారు.
  • ఏ గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ఉన్నా..ఐకేపీ కావొచ్చు, మార్కెట్ యార్డు కావొచ్చు లేక పీఏ సీఎస్ వాళ్లు నడిపినా అక్కడ వ్యవస్థ పూర్తిగా విఫల మైంది.
  • భారదన్ లేకపోవడం, భారదన్ ఉంటే కాంటా (తూకం) లేకపోవడం, కాంటా ఉంటే లారీల్లో ఎత్తక పోవడం, లారీలో ఎత్తితే మిల్లర్లు దించకపోవడం, దించి న తర్వాత కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు సమ యానికి పడకపోవడం ఈ మొత్తం వ్యవస్థ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
  • ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి దుర్వ్యవస్థ రైతులు చూడలేదు.
  • గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కొనుగోలు కేంద్రా లు సమయానికి ప్రారంభించడమే కాకుండా, ప్రతి రోజు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఎన్ని లారీలు వెళ్లాయి అనే పూర్తి నివేదిక సాయంత్రం వరకు సీఎంకు చేరేదన్నారు.
  • తాను రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో కూడా ప్రతి రోజు రిపోర్ట్ పంపేవారని, ఎక్కడైనా కొనుగోలు తక్కువగా ఉంటే అక్కడి కలెక్టర్‌తో నేరుగా సీఎం కేసీఆర్ మాట్లాడేవారని చెప్పారు.
  • అప్పట్లో పౌర సరఫరాల శాఖ ముందుగానే సమీక్షలు చేసి, గన్నీ బ్యాగులు, లారీలు, మిల్లర్ల సమన్వయం చూసుకునే దని తెలిపారు. ఎప్పుడూ రైతులకు ఇబ్బంది కలగలేదు.
  • వర్షాలు వచ్చి ధాన్యం తడిసినా కూడా, గింజా నష్టం లేకుం డా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
  • 9½ ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులు పండించిన ప్రతి గింజకు వరి, కందులు, పెసరలు, మక్కలు ఏదైనా కనీస మద్దతు ధర ఇచ్చారు.
  • కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా వ్యవస్థ నడిచిందో, ఇప్పుడూ అలాగే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
  • సీఎం రేవంత్ రెడ్డి లారీలతో, మిల్లర్లతో మాట్లాడాలని, అధికారులను సమన్వయం చేయాలని ఆదేశాలు ఇవ్వా లని కోరారు.
  • ఒక కోటి మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ వాస్తవంగా 60–70 లక్షల మెట్రిక్ టన్నులకంటే ఎక్కువ కొనుగోలు చేయలేరు.
  • ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖ కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసింది. ఇది మొత్తం లక్ష్యంలో 25 శాతం మాత్రమేనని తెలిపారు.
  • కోతలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, కానీ కొనుగో లు ఎందుకు కేవలం 25 శాతమే జరిగిందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
  • వర్షాలు పడిన ప్రాంతాల్లో తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
  • జనగామ, చేర్యాల మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ మూసివేసిన మార్కెట్లు ఉన్నా వెంటనే తెరిచి, వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here