22.4 C
London
Saturday, May 30, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కామ్రేడ్ గంగసాని రఘుపాల్ సేవలు చిరస్మరణీయం

కామ్రేడ్ గంగసాని రఘుపాల్ సేవలు చిరస్మరణీయం

0
  • ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడు
  • విద్యార్థి ఉద్యమంలో ఆయన నాయకత్వంలో పనిచేశాను
  • రఘుపాల్ సంవత్సర వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్:

జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గబ్బేట గ్రామానికి చెందిన హైదరాబాద్ నగర మాజీ సీపీఎం కార్యదర్శి, పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ గంగసాని రఘుపాల్ (raghupal) సంవత్సర వర్ధంతి కార్యక్రమం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో(Sundarayya Science Centre) ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జన గామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అతిథిగా హాజరై రఘుపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు..గంగసాని రఘుపాల్ జీవితాంతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. ఆయన నిరాడంబర జీవితం, ప్రజల పట్ల అంకిత భావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.

తాను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమంలో ఉన్న సమయంలో రఘుపాల్ నాయకత్వంలో పనిచేసినట్లు తెలిపారు. రఘుపాల్ కుటుంబం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చరిత్ర కలిగి ఉందన్నారు. ఆ కుటుం బం ప్రజా పోరాటాలకు అంకితమైనదని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, హైద రాబాద్ నగర కార్యదర్శిగా మూడు పర్యాయాలు బాధ్య తలు నిర్వహించి పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందిం చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పేద ప్రజల హక్కుల కోసం, సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం రఘుపాల్ చివరి వరకు కృషి చేశారని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here