- బీఆర్ఎస్ కార్యకర్త మహ్మద్ ముగ్ధమ్ భౌతికకాయానికి నివాళులు..
- కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా
జనగామ:
జనగామ మండలం శామీర్‌పేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మహ్మద్ ముగ్ధమ్ అకాల మరణం చెందడం పట్ల జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla palla Rajeswer Reddy)తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే శుక్రవారం ఆయన ముగ్ధమ్ స్వగ్రామానికి చేరుకుని భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తను కోల్పోవడం ఎంతో బాధాకరమన్నా రు. ముగ్ధమ్ మృతి వారి కుటుంబానికి మాత్రమే కాకుండా పార్టీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబా నికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

















