17.4 C
London
Thursday, July 16, 2026
Home క్రీడలు గ్రామీణ ప్రతిభే మా బలం..

గ్రామీణ ప్రతిభే మా బలం..

0
  • అనురాగ్ నల్గొండ నైట్స్‌పై పూర్తి నమ్మకం ఉంది..
  • జట్టుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.
  • టీజీ20లో రాజకీయ జోక్యం లేదు.
  • గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయి వేదిక కల్పించడమే లక్ష్యం.
  • గెలుపు, ఓటమి కాదు..ఆటను ఆస్వాదించడమే ముఖ్యం

                 ఉప్పల్ స్టేడియంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్:

టీజీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం (UPPAL STADIUM)లో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA)మీడియాతో అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టుపై ఉన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశా రు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి తెలంగాణకు గొప్ప క్రికెటర్లను అందించాలన్నదే తమ లక్ష్య మని స్పష్టం చేశారు.

ఉప్పల్ స్టేడియంలో ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • తాను ఫిజిక్స్ విద్యార్థినని, న్యూటన్ యాక్షన్–రియాక్షన్ సిద్ధాంతాలు తెలుసు..ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాను. క్రికెట్‌ను మాత్రం క్రీడా స్ఫూర్తితోనే చూస్తాను.
  • టీం ఎంపిక పూర్తైన తర్వాత కోచ్, మేనేజ్‌మెంట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఎలాంటి జోక్యం చేసుకోలేదు.
  • డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అనురాగ్, తారా సింగ్‌తో కూడిన బృందం జట్టును సమర్థంగా నడిపిస్తోందని ప్రశంసించారు.
  • అనురాగ్ నల్గొండ నైట్స్ అన్ని విభాగాల్లో సమతూకంతో కూడిన బలమైన జట్టుగా ఉందని చెప్పారు.
  • ఓపెనర్లు, బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, పేసర్లు, స్పిన్నర్లు సమ ర్థంగా ఉన్నారు. జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తొలి లక్ష్యం ఫైనల్ ఫోర్‌లోకి చేరడమేనని, ప్రస్తుతం జట్టు మంచి స్థితిలో ఉందని పేర్కొన్నారు.
  • టీజీ20 టోర్నమెంట్‌లో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, ఆటగాళ్ల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు.
  • ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించామని, స్పోర్ట్స్‌ మన్ స్పిరిట్ ఉన్న క్రీడాకారులనే ఎంపిక చేశామని తెలిపారు.
  • ప్రతి మ్యాచ్‌కు వేలాదిగా ప్రేక్షకులు హాజరవడం ఈ టోర్న మెంట్ విజయానికి నిదర్శనమని చెప్పారు.
  • తెలంగాణలోని జిల్లా స్థాయి క్రీడాకారులకు ఇది గొప్ప వేదికగా మారుతోందన్నారు. అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు గ్రామీణ యువతకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు.
  • ఈ అవకాశం నగరాలకే పరిమితం కాకూడదు. పల్లెల్లో దాగి ఉన్న అసలైన ప్రతిభ ప్రపంచం ముందుకు రావాలి. అదే అనురాగ్ నల్గొండ నైట్స్ ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశం. గ్రామీణ యువతకు పెద్ద వేదిక కల్పించి, తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
  • గెలుపు, ఓటములు క్రీడలో సహజమని, గెలిస్తే ఆనందమే కానీ ఓడినా ఆటను ఆస్వాదించాలనే మనస్తత్వం ఉండాలని సూచించారు.
  • తాను కూడా క్రికెట్ అభిమానినేనని, ఆటగాళ్లు ఫలితం గురించి ఆలోచించకుండా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here