17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ఆదర్శ విద్యావేత్త ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణకు అశ్రుపూర్వక వీడ్కోలు

ఆదర్శ విద్యావేత్త ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణకు అశ్రుపూర్వక వీడ్కోలు

0
  • ఉన్నత విద్యారంగం ఓ మహోన్నత విద్యావేత్తను కోల్పోయింది
  • స్వయంగా పాడె మోసి చివరి వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే 
  • కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్:

ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్(Former Regist rar, Senior Professor in the Department of Mec hanical Engineering) పప్పుల లక్ష్మీనారాయణ అంతి మయాత్రలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA PALLA RAJESWER REDDY)స్వయంగా పాడె మోసి, ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ పట్ల తనకున్న ఆప్యా యత, గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం ప్రొఫెసర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సాను భూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:

  • జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం సిరిపురం గ్రామంలో జన్మించిన ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ విద్యారంగంలో తనదైన ముద్ర వేశారు.
  • 1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యా పకుడిగా సేవలు ప్రారంభించి, తన ప్రతిభతో ప్రొఫెసర్‌గా ఎదిగి, 2021 నుంచి 2024 వరకు రిజిస్ట్రార్‌గా విశిష్ట సేవలు అందించారు.
  • విద్య, పరిశోధన, పరిపాలన రంగాల్లో ఆయన అందించి న సేవలు చిరస్మరణీయం.
  • వేలాది మంది విద్యార్థుల అభివృద్ధి, అధ్యాపకుల సంక్షే మం కోసం ఆయన చేసిన కృషి చిరస్థాయిగా గుర్తుండి పోతుంది.
  • ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ మరణం ఉన్నత విద్యా రంగానికి, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాల యానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
  • అనంతరం ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణతో తన కున్న ఆత్మీయ అనుబంధాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకు న్నారు. ఆయనతో గడిపిన అనేక జ్ఞాపకాలను స్మరిం చుకుంటూ, వారి ఆశయాలు, సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..కుటుంబ సభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here