- ఎమ్మెల్యే పల్లా కుటుంబ సమేతంగా హాజరు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శుభం కన్వెన్షన్‌లో కి.శే. శ్రీమతి చాడ జయప్రద 12వ రోజు సపిండీకరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAON MLA PALLA)కుటుంబ సమేతంగా హాజరయ్యా రు. ఈ సందర్భం గా జయప్రద గారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. అనంతరం మేనల్లుడు చాడ ప్రవీణ్, మేన కోడలు హరిప్రియతో పాటు కుటుంబ సభ్యు లను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

















