13.6 C
London
Monday, June 1, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన జనగామ నియోజకవర్గం..!

అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన జనగామ నియోజకవర్గం..!

0
  • అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన జనగామ నియోజకవర్గం..!

                   ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల:

రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కుల పంపిణి చేసిన నియోజకవర్గం జనగామేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం చేర్యాల మున్సిపల్ కేంద్రంలోని పిఏంఆర్ గార్డెన్ లో చేర్యా ల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాలకు చెంది న లబ్ధిదారులకు రూ.13 లక్షల 50 వేల విలువైన 61 సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాల్లో ఏవైనా ఆరోగ్య సమ స్యలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. అవసరమైతే నీలిమ హాస్పిటల్ సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. నీలిమ హాస్పిటల్ ద్వారా డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు వేలాది మంది కి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల కోసం ఎప్పటికీ కట్టుబడి పనిచేస్తాను..అభివృద్ధి విషయం లో ఎలాంటి వెనుక డుగు ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here