15.2 C
London
Thursday, June 11, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ పేదలకు వైద్యం అందించడమే నా ప్రధాన లక్ష్యం

పేదలకు వైద్యం అందించడమే నా ప్రధాన లక్ష్యం

0
  • జనగామ బిడ్డలకు నీలిమా హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందిస్తున్నాం
  • ఒక్క సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు కూడా రిజెక్ట్ కాలేదు
  • రూ.12.34 లక్షల విలువైన 37 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

                   జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో బుధవారం జనగామ పట్టణంతో పాటు జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మేట, తరిగొప్పుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.12 లక్షల 34 వేల విలు వైన 37 సీఎంఆర్ఎఫ్(CMRF CHECKS)చెక్కులను జన గామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు ఎదురైన ప్పుడు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాల న్నారు.అవసరమైతే నీలిమ హాస్పిటల్ సేవలను వినియో గించుకోవచ్చని సూచించారు.

జనగామ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సీఎంఆ ర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం రూ.60 వేల వరకు మాత్రమే పరిమితి విధించిన ప్పటికీ, ఒక్క కేసు కూడా తిరస్కరణకు గురికాకుండా చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. గత రెండున్నర సంవత్స రాల్లో సీఎంఆర్ఎఫ్‌కు సంబంధించిన ఒక్క దరఖాస్తు కూడా రిజెక్ట్ కాకుండా చూసుకున్నామని వెల్లడించారు.

జనగామ నియోజకవర్గ ప్రజలకు వైద్యం విషయంలో ఎలాం టి ఇబ్బందులు ఉండకూడదన్నదే తన లక్ష్యమని పేర్కొన్నా రు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సదుపాయం కల్పిం చేందుకు మంత్రిని తీసుకొచ్చి ప్రారంభించామన్నారు. ఆసు పత్రులను పలుమార్లు సందర్శించి సిబ్బంది కొరతపై చర్చిం చి అవసరమైన సిబ్బందిని నియమించామని తెలిపారు.

చేర్యాల, జనగామ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుప త్రులతో పాటు నీలిమ హాస్పిటల్‌లో రోజుకు సుమారు 300 మందికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. జనగామ బిడ్డలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గత రెండున్నర సంవ త్సరాల్లో అనేక కార్యక్రమాలను అమలు చేశామని, వచ్చే రెండున్నర సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా ప్రజాసేవ కొనసాగిస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here