- మండపం మండపాన గణనాథుడికి ప్రత్యేక పూజలు
- భక్తులు, యువత, ఉత్సవ కమిటీ సభ్యులతో ఆత్మీయంగా మమేకం
- అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో భక్తులతో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందడి చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన Ganesh Mandapsను ఆయన సందర్శించి కొలువుదీరిన గణనా థుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, యువత, Ganesh Utsav Committee సభ్యులు, భక్తులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మమేకమయ్యారు. మండపాల వద్దకు ఎమ్మెల్యే చేరు కోగానే భక్తులు, స్థానికులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. గణనాథుడి ఆశీస్సులతో జనగామ నియోజక వర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజక వర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
మండపం మండపాన గణనాథుడికి ప్రత్యేక పూజలు
జనగామ పట్టణంలోని 1, 14వ వార్డుల్లో ఏర్పాటు చేసిన Ganesh Mandapsను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో Ganesh Navaratri Celebrations నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
పలు వార్డుల్లో పూజలు.. అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జనగామ పట్టణంలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన Ganesh Mandapను కూడా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Annadanam Programmeలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వినాయక ఉత్సవాలు సోదరభావానికి ప్రతీకగా నిలవాలి: ఎమ్మెల్యే పల్లా
వినాయక నవరాత్రి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్ర మాలకే పరిమితం కాకుండా సామాజిక సేవ, సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఎమ్మెల్యే పల్లా అన్నారు. Ganesh Utsav సందర్భంగా అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపతి మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని Utsav Organisersకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలంతా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో Ganesh Navaratri Celebrat ions నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

















