- మత సామరస్యానికి చిరునామాగా జనగామ
- గణేష్ మహారాజ్‌ను పూజించినా.. అల్లాహ్‌ను ప్రార్థించినా.. కోరేది ప్రజల శ్రేయస్సే
- సేవా స్ఫూర్తికి ప్రతీకగా అన్నదానం
- వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
- వినాయక నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ జిల్లా కేంద్రంలోని 7వ, 10వ వార్డుల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాలను శనివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నం వడ్డించా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- జనగామ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాం క్షలు..విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
- పండుగలు ప్రజలను మరింత దగ్గర చేసే వేదికలు.. భక్తిశ్రద్ధ లతో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది.
- మత సామరస్యానికి జనగామ ప్రతీక.. హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం అభినందనీయం.
- 7వ వార్డులో సాజిద్ భాయ్ నాయకత్వంలో ముస్లిం సోద రులు స్వయంగా వచ్చి హిందూ సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడం, ఉత్సవాల్లో భాగ స్వాములు కావడం సర్వమత సౌభ్రాతృత్వానికి నిదర్శనం.
- మనుషులందరం ఒక్కటే. మత విశ్వాసాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ సమాజంలో శాంతి, సుఖసంతోషాలు, అభివృ ద్ధి ఉండాలన్నదే అందరి ఆకాంక్ష..
- అల్లాహ్‌ను ప్రార్థించినా.. గణేష్ మహారాజ్‌ను పూజించినా.. ప్రజలందరికీ మంచి జరగాలని, సమాజ శ్రేయస్సు కలగా లని కోరుకోవడమే మనందరి లక్ష్యం.
- పండుగల సందర్భంగా కనిపిస్తున్న శాంతి, సద్భావన, సోదరభావం నిరంతరం కొనసాగాలి.
- అన్నదానం గొప్ప సేవా కార్యక్రమం..భక్తులతో కలిసి అన్న దానంలో పాల్గొని స్వయంగా అన్నం వడ్డించడం సంతోషం గా ఉంది.
- జనగామ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురా రోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షి స్తున్నాను.
- వినాయక మహారాజ్ ఆశీస్సులతో ప్రతి ఇంటా శుభం, జనగామ నియోజకవర్గంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని మనస్ఫూ ర్తిగా కోరుకుంటున్నాను.

















