హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులతో జరిగిన తోపులాటలో గాయాలపా లై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ (BRS Party Working President KTR) పరా మర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ తో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Jangaon MLA Dr. Palla Rajesh war Reddy), పలువురు బీఆర్‌ఎస్ నాయకులు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జగదీష్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రస్తుతం అందుతు న్న వైద్య చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసు కున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలో గాయపడిన జగదీ ష్ రెడ్డి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.

















