హైదరాబాద్:
చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ గారి మనవడి 21వ రోజు వేడుకలు, నామకరణ కార్యక్రమం హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Jangaon MLA Dr. Palla Rajeshwar reddy) హాజరై చిన్నారిని ఆప్యాయంగా ఆశీ ర్వదించారు. అనంతరం ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదిగి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకో వాలని ఆయన ఆకాంక్షించారు.

















