- ప్రజా సమస్యలు ప్రశ్నిస్తామనే భయంతోనే అడ్డుకుంటున్నారు
- 22A భూములు.. ఫీజు బకాయిలపై ప్రశ్నిస్తామనే భయమా..?
- 500 మంది పోలీసులతో ఎమ్మెల్యేల దిగ్బంధం ఎందుకు..?
- దాడి చేసిన వారిపై చర్యలు లేవు..బాధితులపైనే రివర్స్ కేసులు
- అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా..?
- మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై జాతీయ కమిషన్లకు ఫిర్యాదు
- అప్రజాస్వామిక చర్యలను ప్రజలు సహించరు
- ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు చెబుతారు
ఢిల్లీలో మీడియాతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనతో పాటు, ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించిన అంశంపై జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, జాతీ య మానవ హక్కుల కమిషన్(National Commission for Women (NCW), National Human Rights Com mission (NHRC) ప్రతినిధులను కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ తో పాటు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కమిషన్ల ప్రతినిధులకు ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మహిళా ఎమ్మె ల్యేలపై జరిగిన ఘటన, శాసనసభ్యులను అసెంబ్లీకి వెళ్ల కుండా అడ్డుకోవడం, హక్కులకు భంగం కలిగించడం వంటి అంశాలపై ఫిర్యాదు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
- మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి ఘటనను జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం.
- మా హక్కులకు భంగం కలిగించడం, అసెంబ్లీలో మాట్లా డే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం, ప్రశ్నించినం దుకు సభ్యులను సస్పెండ్ చేయడం వంటి అంశాలను కమిషన్ల దృష్టికి వివరించాం.
- అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పురుష పోలీసులు దాడి చేశారనే ఆరోపణలకు సంబంధించిన ఆధారాల ను కమిషన్లకు సమర్పించాం.
- ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కమిష న్ల ప్రతినిధులకు అందజేశాం.
- మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవా లని ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
- కానీ ఉల్టా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీతో పాటు ఇతర మహిళా నేతలపైనే రివర్స్ కేసులు నమోదు చేశారు.
- ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం.
- అసెంబ్లీకి వెళ్లే శాసనసభ్యులను అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
- సాధారణ పోలీసులతో పాటు గ్రేహౌండ్స్, టాస్క్ఫోర్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాలను మోహరించి ప్రజాప్రతినిధులను అసెంబ్లీకి వెళ్లకుం డా అడ్డుకున్నారు.
- సుమారు 500 మంది పోలీసులను ఎందుకు మోహ రించాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
- ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే భయంతోనే మా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
- 22A భూముల అంశం, భూముల రిజిస్ట్రేషన్లలో జరు గుతున్న అక్ర మాలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్య లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రైతుల సమ స్యలు వంటి ప్రజా సమస్యలను ప్రశ్నిస్తామనే భయం తోనే మమ్మల్ని అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటు న్నారు.
- గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడు దల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబ ర్స్మెంట్ బకా యిలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే భయంతోనే మమ్మల్ని సస్పెండ్ చేశారు.
- ప్రజా సమస్యలను లేవనెత్తకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.
- ప్రతిరోజూ మా మీద నాలుగైదు కేసులు పెడుతున్నారు.
- ప్రశ్నించే ప్రతిపక్షాన్ని అణిచివేయడానికి అక్రమ కేసులు బనాయిం చడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
- ప్రశ్నించే గొంతును అణిచివేసేందుకు అసత్య ఆరోపణలు చేస్తూ రివర్స్ కేసులు నమోదు చేస్తున్నారు.
- మహిళా ప్రజాప్రతినిధుల గౌరవం, భద్రత విషయంలో జాతీయ మహిళా కమిషన్ స్పందన ఆశాజనకంగా ఉంది.
- మేము వివరించిన అంశాలను ఎన్సీడబ్ల్యూ, ఎన్హెచ్ఆర్సీ ప్రతిని ధులు సావధానంగా విన్నారు.
- చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని కమిషన్ల ప్రతినిధులు హామీ ఇచ్చారు.
- మహిళల గౌరవం, ఆత్మగౌరవం, ప్రజాప్రతినిధుల హక్కుల పరిరక్ష ణకు తగిన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉంది.
- 30 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగి, పలుమార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన సీనియర్ ప్రజాప్రతినిధులను సైతం రోడ్డుపైనే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం..?
- సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరు… బయటకు వస్తే రోడ్డుపైనే అడ్డు కుంటారు.
- మహిళా ఎమ్మెల్యేల ముందు పురుష పోలీసులను, పురుష ఎమ్మెల్యే ల ముందు మహిళా పోలీసులను నిలబెట్టి ఉద్దేశపూర్వకంగా గందర గోళం సృష్టిస్తున్నారు.
- రాష్ట్రంలో సాధారణ నేరాలను నియంత్రించడంపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, రైతులు, కార్మికులపై పోలీసు బలగాలను ప్రయోగిస్తున్నారు.
- నేరాలను అదుపు చేయడంలో విఫలమవుతున్న ప్రభుత్వం, ప్రశ్నించే వారిపై మాత్రం కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, పోలీసు బలగా లను ప్రయోగించడం చేస్తోంది.
- ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
- ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచలేరు.
- ప్రజల సమస్యల కోసం భారత్ రాష్ట్ర సమితి పోరాటం కొనసాగుతుం ది.
- ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు సహించరు.
- ప్రజలే తగిన సమయంలో తగిన తీర్పు చెబుతారు.

















