17.4 C
London
Thursday, July 16, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ ఆర్డర్స్ చూపించండి..పోలీసులను నిలదీసిన ఎమ్మెల్యే పల్లా 

ఆర్డర్స్ చూపించండి..పోలీసులను నిలదీసిన ఎమ్మెల్యే పల్లా 

0
  • కేటీఆర్ కాన్వాయ్ అడ్డుకోవడంపై పోలీసులతో పల్లా వాగ్వాదం.. 
  • లారీలను అడ్డంగా నిలిపి కాన్వాయ్ నిలిపివేత..
  • కొద్దిసేపు ఉద్రిక్తత

రఘునాథపల్లి:

రఘునాథపల్లి మండలం కొమ్మాల టోల్‌గేట్(Komalla Tollgate) వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. కన్నెపల్లి పంప్‌ హౌస్ పరిశీలనకు వెళ్తు న్న కేటీఆర్‌ను టోల్‌గేట్ వద్దే  బారికేడ్లతో పాటు భారీ లారీ లను హైవేపై అడ్డంగా నిలిపి కాన్వాయ్ ముందుకు వెళ్ల కుండా నిలిపివేశారు.

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే పోలీసు అధికారుల వద్ద కు వెళ్లారు. ఏ ఆర్డర్స్‌తో అడ్డుకుంటున్నారు..? మీ వద్ద ఉన్న లిఖితపూర్వక ఉత్తర్వులు చూపించండి అంటూ పోలీసులను నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను అడ్డుపె ట్టుకుని ప్రతిపక్షాల పర్యటనలను ఎలా అడ్డుకుంటారని పల్లా పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు, పల్లాకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ప్రజాప్రతినిధులను ఎలాంటి కార ణం లేకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధమని, శాంతియుతం గా ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న ప్రతిపక్షనాయకులను అడ్డు కోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డం పెట్టుకుని తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. వరదలు, అకాల వర్షాల వల్ల ప్రాజెక్టులు, పంటలు దెబ్బతింటే వాటిని పరిశీలించే హక్కు కూడా ప్రతిపక్షాలకు లేదా అని పల్లా ఈ సందర్భంగా మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here