18.5 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ తపాస్ పల్లి పంపులకు కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం..రైతులకు ఏం చేస్తుంది?

తపాస్ పల్లి పంపులకు కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం..రైతులకు ఏం చేస్తుంది?

0
  • కేసీఆర్ చేసిన పనులపై విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు
  • రైతులు, మహిళలు, నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసింది
  • 22A పేరుతో పేదల భూములను నిర్బంధిస్తున్నారు..అక్రమ వసూళ్ల ఆరోపణలపై సమాధానం చెప్పాలి
  • 2లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ? నిరుద్యోగ యువతను మోసం చేశారు
  • పెన్షన్ పెంపు హామీ మరిచారు.. మూడు నెలలుగా పెన్షన్లు నిలిచిపో యాయి
  • 420 హామీలు..6 గ్యారెంటీలు ఏమయ్యాయి?
  • రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు
  • పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలి
  • కేసీఆర్‌ను విమర్శించే ముందు కాంగ్రెస్ తన వైఫల్యాలను చూసుకోవాలి
  • ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్‌ను వదిలేది లేదు
  • హామీలు బాకీలుగా మారాయి.. కాంగ్రెస్ పాలనపై ఎమ్మెల్యే పల్లా ఫైర్

చేర్యాల:

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పేదలను మోసం చేస్తోందని జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 420 హామీలు, 6 గ్యారెం  టీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వా  నికి వ్యతిరేకంగా(Against the Congress government for failing to implement 420 promises and 6 guara ntees) చేర్యాల డివిజన్ ఆధ్వర్యంలో గురువారం రైతులు, మహిళల మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతులకు ఎకరానికి రూ.15వేల రైతుభరోసా ఇస్తామని, మూడు పంట లకు పెట్టుబడి సాయం అందిస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరో సా ఇస్తామని ఎన్నికల సమ యంలో హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయలేదన్నారు. ఐదు సార్లు ఇవ్వాల్సిన రైతుబంధును మూడు సార్లు ఎగ్గొ ట్టారని, ఒకసారి సగం మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.

రైతుభీమా నిలిపివేత దారుణం:

కేసీఆర్ హయాంలో రైతు మరణించిన వారం, పది రోజు ల్లోనే రూ.5 లక్షల రైతుభీమా అందేలా చర్యలు తీసుకున్నా  మని పల్లా గుర్తుచేశారు. లక్షలాది మంది రైతు కుటుంబా లకు రైతుభీమా ద్వారా అండగా నిలిచిన పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

ధాన్యం బోనస్‌లోనూ మాట మార్చారు:

వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమ యంలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం మాట మార్చిందని పల్లా ఆరోపించారు. తొలుత 33 రకాల సన్న వడ్లు సాగు చేయా లని చెప్పి, ఇప్పుడు కేవలం ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని నిబంధనలు పెట్టడం రైతులను గందరగోళానికి గురిచేయడమేనన్నారు. మొత్తం ధాన్యానికి బోనస్ ఇస్తా మని చెప్పి ఇప్పుడు షరతులు విధించడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు.

-తపాస్ పల్లి నింపడానికి కూడా చేతకావడం లేదు:

తపాస్ పల్లి, గండి రామారం, ధర్మసాగర్, లక్నవరం వంటి ప్రాజెక్టులు, చెరువులు గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసినవేనని ఎమ్మెల్యే పల్లా గారు అన్నారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా లక్నవరం నుంచి రామప్ప మీదుగా ఉనికిచర్ల వరకు సుమారు 42 కిలోమీటర్ల టన్నెల్ నిర్మా ణానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

సమ్మక్క సాగర్ వద్ద ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీటిని వినియో గించుకోలేని పరిస్థితి నెల కొందన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన మోటార్లను నడిపించడంలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు.

గోదావరిలో నీళ్లు ఉన్నాయి..నీటిని ఎత్తిపోసే మోటార్లు ఉన్నాయి.. కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు ఉన్నాయి.. కరెంట్ సదుపాయం కూడా ఉంది..అయినా తపాస్ పల్లి నింపలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

తపాస్ పల్లి పంపులను గత పదేళ్లుగా నిర్వహిస్తూ చేర్యాల, కొముర వెల్లి, మద్దూరు ప్రాంతాలకు సాగునీరు అందించా మని తెలిపారు. ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంపులకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయలేకపోతు న్నారని విమర్శించారు.

ఉచిత విద్యుత్ హామీ ఎక్కడ?

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలుమా ర్లు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా  ఆరోపిం చారు. కనీసం 10 గంటలపాటు కూడా నిరంతర విద్యుత్ అందడం లేదన్నారు.

కరెంట్ ఇవ్వడం చేతకాక రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను నిలిపివేసి, పంటలకు బోనస్ విషయంలోనూ నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు.

రుణమాఫీపై రైతులకు మోసం:

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఎమ్మెల్యే పల్లా అన్నారు. రూ.50 వేల కోట్లు అవసరమని చెప్పి, ఆ తర్వా త బ్యాంకర్ల సమావేశంలో రూ.40 వేల కోట్లకు, బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లకు తగ్గించి, చివరకు రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపిం చారు.

కేసీఆర్ హయాంలో రెండు విడతల్లో రూ.29,500 కోట్ల రుణమాఫీ చేశామని, కోవిడ్, డీమోనిటైజేషన్ వంటి సవా ళ్లు ఉన్నప్పటికీ రైతు బంధు, రైతుభీమా, ధాన్యం కొనుగోళ్ల ను సమర్థవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు.

యూరియా కోసం రైతుల ఇబ్బందులు:

గత పదేళ్లలో రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేశామని పల్లా తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్ నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తు  న్నారని, యూరియా కోసం రైతులు అవస్థలు పడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.

మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

కళ్యాణలక్ష్మి పథకం ద్వారా పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించామని ఎమ్మెల్యే పల్లా గారు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1 ల క్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పు డు ఆ హామీని అమలు చేయకుండా మహిళలను మోసం చేసిందని విమర్శించారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని చెప్పారని, కానీ అమలు చేయలేదన్నారు. పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని చెప్పి నెరవేర్చలేదని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోందని, పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

-ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులకు నష్టం:

కాలేజీకి వెళ్లే యువతులకు స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని పల్లా అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ ఆటో కార్మికుల జీవనోపాధిపై ప్రభావం పడేలా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.

ఉద్యోగాల హామీతో నిరుద్యోగుల మోసం:

రేవంత్‌రెడ్డి అధికారంలోకి వస్తే 50 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వ హిస్తామని ప్రచారం చేసి, చివరకు 10 వేలకుపై గా పోస్టులకే పరిమితం చేశారని ఎమ్మెల్యే పల్లా ఆరోపించారు.

ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరు ద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా యువతను నిరాశకు గురి చేశారని అన్నారు.

-22A పేరుతో పేదల భూములకు ఇబ్బందులు:

దూలమిట్ట, మద్దూరు, కొమురవెల్లి, చేర్యాల తదితర ప్రాంతాల్లో పేద లు, రైతుల భూములను 22A నిబంధన కింద పెట్టి రిజిస్ట్రేషన్లు కా కుండా ఇబ్బందులకు గురిచే స్తున్నారని పల్లా ఆరోపించారు.

22A నుంచి భూములను మినహాయించేందుకు కొందరు రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అధికారు లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

నిజంగా ప్రభుత్వ భూములు అయితేనే 22A నిబంధనలు వర్తింప జేయాలి..పేదలు, రైతుల సొంత భూములను వెంట నే ఆ నిబంధనల నుంచి తొలగించాలని కోరారు. ప్రజల భూముల కోసం కేటీఆర్, హరీశ్‌ రావు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు:

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మహిళలకు గౌరవం, రైతులకు భరోసా, వృత్తిదారులకు ఆసరా కల్పిం చేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పల్లా అన్నారు.

రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు వంటి కార్య క్రమాలతో రైతులకు అండగా నిలిచిన కేసీఆ ర్‌ను ప్రతిరోజూ విమర్శించడం సరికాదన్నారు. ప్రజ లకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు.

ఎన్నికల సమయంలో బాండ్ పేపర్లు, గ్యారెంటీ కార్డులతో హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పొంగులేటి రాజీనామా చేయాలి:

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే పల్లా అన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్య లకు ప్రభుత్వం బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

420 హామీలు, 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యా లకు సమాధానం చెప్పాలని, హామీలను నెరవేర్చడంలో విఫలమైన రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసా గేందుకు నైతిక హక్కు లేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here