15.9 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ బచ్చన్నపేట రోడ్డు పనుల్లో జాప్యం సహించేది లేదు..!

బచ్చన్నపేట రోడ్డు పనుల్లో జాప్యం సహించేది లేదు..!

0
  • ప్రమాదకర విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలి
  • రైతులే కాలువ గండ్లు పూడ్చుకోవడం బాధాకరం
  • 26 గ్రామాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి
  • పనులు ఆలస్యం చేస్తే తీవ్రంగా నిలదీస్తాం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

బచ్చన్నపేట:

సిద్దిపేట–జనగామ ప్రధాన రహదారిలో బచ్చన్నపేట వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులను(Road works underw ay at Bachannapet) వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందు లు లేకుండా చూడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రోడ్డు పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణంతో పాటు విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీ, సాగు నీటి సమస్యలపై అధికారులతో ఫోన్చ ద్వారా చర్చించారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి:

బచ్చన్నపేట మెయిన్ రోడ్డు నిర్మాణం దాదాపు ఏడాది కాలంగా ఆలస్యమవుతుండటంతో ప్రజలు, వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బీటీ, మెయింటెనెన్స్ పనులను మరో 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారని అన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికా రులకు సూచించారు.

ప్రమాదకర విద్యుత్ స్తంభాలను తొలగించాలి:

రోడ్డు విస్తరణ, రహదారి ఎత్తు పెరగడంతో ఇరువైపులా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్లు, పాత ఐరన్, ఎంఎస్ పోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా మలుపుల వద్ద వంగి పోయిన విద్యుత్ స్తంభా  లను వెంటనే మార్చాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

పెద్ద వాహనాలకు విద్యుత్ వైర్లు తగిలే ప్రమాదం ఉన్నం దున వైర్ల ఎత్తును పెంచడంతో పాటు అవసరమైన చోట స్తంభాలను రోడ్డుకు కొద్దిగా లోపలికి జరిపి కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు పనుల్లో భాగంగా అవసరమైన డివియేషన్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమ స్యను తక్షణమే పరిష్కరించాలని నేషనల్ హైవే, విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.

వంగిపోయిన 11 కేవీ పోల్‌ను వెంటనే మార్చాలి:

బచ్చన్నపేట వద్ద మలుపులో వంగిపోయిన 11 కేవీ ఐరన్ పోల్ అత్యం త ప్రమాదకరంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. కొత్తగా రోడ్డు నిర్మా ణం పూర్తయిన తర్వాత వాహనాలు ఢీకొంటే స్తంభం కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా ఆ స్తంభాన్ని సుమారు ఐదు అడు  గుల మేర రోడ్డుకు లోపలికి జరిపి కొత్తగా ఏర్పాటు చేయా లని అధికారులను కోరారు. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ఈ పనిని ఆలస్యం చేయకుండా తక్షణమే చేపట్టాలని సూచించారు.

డ్రైనేజీ పైప్‌లైన్‌ను ముందుగానే ఏర్పాటు చేయాలి:

బచ్చన్నపేట చౌరస్తా వద్ద ఆలేరు రోడ్డు వైపు నుంచి వచ్చే వర్షపు నీరు నిలిచిపోకుండా తగిన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఆలేరు రోడ్డు మూల నుంచి నీరు సక్రమంగా వెళ్లేలా వెంటనే పైప్‌లైన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డుకు బీటీ వేసిన తర్వాత పైప్‌లైన్ కోసం మళ్లీ రోడ్డును తవ్వితే ప్రజాధనం, శ్రమ వృథా అవుతాయని అన్నారు. అందువల్ల ముందుగానే డ్రైనేజీ పైప్‌లైన్ పనులు పూర్తి చేసి, ఆ తర్వాత బీటీ రోడ్డు పనులు చేపట్టాలని సూచించా రు. వారం రోజుల్లో పైప్‌లైన్ పనులు పూర్తి చేసి, అనంతరం బీటీ పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు.

26 గ్రామాలకు సాగునీరు అందించాలి:

బచ్చన్నపేట మండల పరిధిలోని సుమారు 26 గ్రామాలకు సరైన సాగు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని ఎమ్మెల్యే అన్నారు. నీటి కొరత కారణంగా చాలా ప్రాంతాల్లో సగం మేర వరి నాట్లు కూడా పూర్తికాని పరిస్థితి నెలకొందన్నారు.

తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి గుడిచెరువు, ఇతర చెరువు లకు మరింత నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

కాలువ గండి పనులు రైతులే చేసుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం :

గనుగపహాడ్ వద్ద కాలువకు గండి పడినప్పటికీ అధికారు లు స్పందించకపోవడంతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యక ర్తలు రైతుల సహకారంతో సొంత ఖర్చులతో కాలువ మర మ్మతు పనులు చేపట్టాల్సి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన చోట తాము ముందుండి పనులు చేపడుతున్నామని అన్నారు.

అధికారులు ఇకనైనా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సమ స్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మళ్లీ కాలువలు తెగిపోయే పరిస్థితి వచ్చినా, ప్రజలు ఇబ్బందులు పడేలా అధికారులు నిర్లక్ష్యం వహించినా తీవ్ర స్థాయిలో నిలదీస్తామని, ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here