- ప్రజా పోరాటాల్లో శ్రీనివాస్ యాదవ్ గారిది ప్రత్యేక పాత్ర
- బలహీన వర్గాలకు బలంగా నిలిచే నాయకుడు
- హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు సమస్య ఎదురైనా అక్కడికి వెళ్లి వారికి అండగా నిలుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పోరాడే నాయకుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొన్నారు. శుక్రవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో(At a press conference held at the MLA camp office in Jang aon)పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- తలసాని శ్రీనివాస్ యాదవ్ సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో కొనసా గుతున్నారని, పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల కు సేవలందించారని పల్లా గుర్తు చేశారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన, తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. సుదీర్ఘ రాజకీ య అనుభవం కలిగిన సీనియర్ నాయకుడిగా రాష్ట్ర రాజ కీయాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తు న్నారని అన్నారు.
- గత కొంతకాలంగా రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడికి వెళ్లి ప్రజల పక్షాన నిలుస్తున్నారని తెలిపారు.
- ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బం దులు ఏర్పడినప్పుడు వాటిని ప్రశ్నిస్తూ, బాధితులకు అండ గా నిలుస్తున్నారని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురై నా వెనుకడుగు వేయకుండా ప్రజల తరఫున పోరాడే ధైర్యం తలసానికి ఉందని పేర్కొన్నారు.
- గతంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజలు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆశ్రయించేవారని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. సమస్యను పరిష్కరించేం దుకు ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉందన్నారు.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలు హైద రాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా బలహీన వర్గాలకు ఇబ్బంది ఎదురైతే వారికి బలాన్ని చేకూర్చేందుకు తలసాని గారు ముందుకు వస్తున్నారని అన్నారు.
- ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో, బాధితులకు అండగా నిలవడంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఉన్న అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
- ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడికి వెళ్లి వారిని పరామర్శించడం, వారి సమస్యలను తెలుసుకోవడం, వారికి న్యాయం జరిగే లా పోరాడటం ఆయన నిత్యకృత్య మని అన్నారు.
- ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తలసాని గారితో పాటు జనగా మకు వచ్చిన టీఆర్ఎస్‌వీ మాజీ ఛైర్మన్, గతంలో ఎమ్మె ల్యేగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్, షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బాలరాజ్ యాద వ్‌కు కూడా స్వాగతం తెలిపారు.
- ప్రజల సమస్యలపై ఎక్కడైనా, ఎప్పుడైనా పోరాడే తలసాని శ్రీని వాస్ యాదవ్ కు జనగామ బీఆర్ఎస్ శ్రేణుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

















