- గౌరవసభ కాస్త కౌరవసభలా మారింది
- సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి పట్ల జరిగిన అనుచిత ప్రవ ర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- మహిళా ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- అసెంబ్లీకి ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నియం తృత్వానికి నిదర్శనం
- నల్ల టీషర్టులకు భయపడేంతగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది
- ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం(Telangana Assem bly Main Gate) వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను అడ్డుకోవడం అత్యంత అప్రజాస్వామిక చర్య అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy)తీవ్రంగా ఖండించారు.
దుర్యోధన పాలనలో దుశ్శాసన పర్వంలా తెలంగాణ అసెం బ్లీ పరిస్థితి మారిందని, గౌరవసభ కాస్త కౌరవసభలా మారిం దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఆలయంగా భావించే అసెంబ్లీలో ప్రజాప్ర తినిధుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత దురదృష్టకర మన్నారు.
ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారితో పాటు ఇతర మహిళా ప్రజాప్రతి నిధుల పట్ల జరిగిన అనుచిత, దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇటువంటి వ్యవహారం ఏమాత్రం సరికాదన్నారు.
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులకు కనీస గౌర వం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నా రు.
కాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ప్రజాప్రతినిధులతో పోలీసులు వ్యవ హరించిన తీరు అత్యంత దురదృష్టకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సరికాదన్నారు. నల్ల టీషర్టులకు భయపడేంతగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందా? నల్ల టీషర్టు ధరించడం ఏ నేరమని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశం తో పోలీసులను ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసా గుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాడే బీఆర్‌ఎస్‌ను ఎంత అడ్డు కున్నా వెనక్కి తగ్గదని, అరెస్టులకు, ఆంక్షలకు, నిర్బంధాల కు భయపడబోమన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమ లు కోసం బీఆర్‌ఎస్ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని తెలిపారు.

















