- రెవెన్యూ అక్రమాలను బయటపెట్టినందుకే నాపై కక్ష సాధింపు..!
- 29 ఎకరాలు నావని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..!
- నిరూపించలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ పొంగులేటికి సవాల్
- 29 ఎకరాల భూదాన్ భూమి ఆరోపణలు పచ్చి అబద్ధాలే
- వట్టినాగులపల్లిలో నాకు ఉన్నది కేవలం ఎకరం 10 గుంటలే
- బినామీలతో భూమి అమ్మాలని ఒత్తిడి..అమ్మకపోతే 22ఏలో పెట్టి బ్లాక్మెయిలా..?
- కేసీఆర్, హరీష్ రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి..!
- పొంగులేటి అహంకారానికి తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారు
- తప్పుడు ఆరోపణలతో రాజకీయంగా దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్:
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శనివారం మాజీ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన అను చిత వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Jangaon MLA Dr. Palla Rajeshwar Reddy on Minister Ponguleti Srinivas Reddys inappropr iate remarks)తీవ్రంగా మండిపడ్డారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అహంకారంతో మాట్లా డుతున్నారు. ఒక మంత్రిగా ఇతరులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులపై మాట్లాడటం ఆయన అహం కారానికి నిదర్శనం.
- తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు సరైన సమయంలో పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారు.
- వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్ 188లో రూ.3 వేల కోట్ల విలువైన 29 ఎకరాల భూదాన్ భూమిని నేను ఆక్రమించా నని ఆరోపించడం పూర్తిగా అవాస్తవం.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే నేను ఎకరం 10 గుంట ల భూమి కి అగ్రిమెంట్ చేసుకున్నాను.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి నెలలోనే, అంటే జూన్ 2014 లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను.
- నేను కొనుగోలు చేసిన ఎకరం 10 గుంటల భూమి భూదాన్ పరిధి లోకి రాదని 2008లోనే భూదాన్ యజ్ఞ బోర్డు నో అబ్జె క్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది.
- 2008లోనే సంబంధిత కోర్టు కూడా ఆ భూమి భూదాన్ భూమి కాదని స్పష్టం చేస్తూ సంబంధిత వ్యక్తుల పేరుపై మార్పులు చేయాలని ఆదేశించింది.
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బినామీలు నా వద్దకు వచ్చి ఆ భూమిని విక్రయించాలని ఒత్తిడి చేశారు.
- ఆ ప్రాంతంలోని ఇతర భూములను మైనంపల్లి సోదరులు కొనుగోలు చేశారు.
- నాకు ఉన్న ఎకరం 10 గుంటల భూమిని వారికి విక్రయిం చకపోవడంతో నాపై కక్ష కట్టారు.
- కేవలం 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే నా భూమితో పాటు ఇతర భూములను కూడా 22ఏ జాబితాలో చేర్చి నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు.
- ఈ అంశంపై మేము కోర్టును ఆశ్రయించగా, ఆ భూమిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించవద్దని కోర్టు అధికారులను ఆదేశించింది.
- అధికారులు కూడా తాము ఆ భూమిలోకి వెళ్లబోమని కోర్టుకు స్పష్టం చేశారు.
- రూ.3 వేల కోట్ల విలువైన 29 ఎకరాల భూమి నాదేనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరూపిస్తే నిమిషంలోనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను.
- ఒకవేళ ఆ ఆరోపణలను నిరూపించలేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
- రూ.3 వేల కోట్ల విలువైన భూమి నాదని చెబుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాన్ని నిరూపించాలి.
- రూ.3 వేల కోట్లు వద్దు.. రూ.10 కోట్లో, రూ.50 కోట్లో నాకిచ్చి ఆ భూమిని తీసుకోవడానికి సిద్ధమైతే ఏ ఉత్తరంపై సంతకం పెట్టమన్నా పెడతాను.
- అసలు లేని భూమిని నా పేరిట ఉన్నట్లుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.
- హరీష్ రావు గారిని జనగామకు తీసుకువెళ్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రెవెన్యూ శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలను బయటపె ట్టినందుకే తనపై, హరీష్ రావు గారిపై, బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
- హరీష్ రావు గారిని జనగామకు తీసుకువచ్చి రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన తర్వాతే ఈ కక్ష సాధింపు చర్యలు మరింత పెరిగాయి.
- కేసీఆర్ గారు, హరీష్ రావు గారిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
- లేకపోతే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారు.

















