17.4 C
London
Thursday, July 16, 2026
Home భక్తి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామాల్లో శాంతి, అభివృద్ధి వర్ధిల్లాలి

అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామాల్లో శాంతి, అభివృద్ధి వర్ధిల్లాలి

0

మద్దూర్ : సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వలంపట్ల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన (Installation of Lord Anjaneya’s Idol)కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ అభ యాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండా  లి. ప్రతి ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం నెలకొని, గ్రామం శాంతి, సౌభ్రాతృత్వంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, గ్రామ అభివృద్ధికి ప్రజలంతా ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ధార్మిక కార్య క్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో భక్తి భావనను పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతకు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత పెద్ద సంఖ్య  లో పాల్గొని స్వామి వారి దీవెనలు పొందారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here