- భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహణ…
- గ్రామాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగాలని ఎమ్మెల్యే పల్లా పిలుపు
మద్దూర్:
జనగామ నియోజకవర్గంలోని మద్దూరు మండలం నర్స య్యపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి విగ్ర హ ప్రతిష్ఠాపన మహోత్సవం(Grand Ceremony for the Installation of the Bodrayi Idol) భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతిష్ఠాపన కార్య క్రమం ఉదయం నుంచే వేద మంత్రోచ్చారణల మధ్య ప్రారంభమై, గ్రామ దేవతకు సంప్రదాయ పద్ధతుల్లో పూజ లు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బొడ్రాయి విగ్రహానికి పూజలు చేసి, గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు. గ్రామం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. పల్లె సంస్కృతి, సంప్ర దాయాలు, ఆచారాలు మన సమాజానికి మూలస్థంభాలని పేర్కొన్నారు. వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకె ళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల ఐక్యతతోనే గ్రామాభి వృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు సామాజిక సౌభ్రాతృ త్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

















