15.2 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు కేసిఆర్ కీలక దిశానిర్దేశం..!

కేసిఆర్ కీలక దిశానిర్దేశం..!

0

  • పార్టీ బలోపేతంపై ఫోకస్
  • పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు

ఎర్రవెల్లి:

Bharat Rashtra Samithi అధినేత K. Chandra shekar Rao ఎర్రవెల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థా గత నిర్మాణం, సభ్యత్వ నమోదు,ఇన్‌చార్జుల నియామకం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు ప్రజల్లో చురుకుగా పనిచేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. ప్రజల మధ్య నిరంతరం ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు లోపా లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

ప్రజల్లో పనిచేయని నాయకులకు ఈసారి టికెట్లు ఉండవని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంపై పోరాటానికి భవిష్యత్ కార్యాచరణను కూడా సమావేశంలో ఖరారు చేసినట్లు సమాచారం.

అదేవిధంగా జిల్లా పరిషత్‌, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలపై కూడా కేసీఆర్ నేతలకు సూచనలు చేశారు. Telanganaలో మారుతున్న రాజకీ య పరిస్థితులు, Bharatiya Janata Party ఫోకస్‌, ఇటీ వల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కూడా చర్చ జరి గినట్లు తెలిసింది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని, పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను విస్తృతంగా నిర్వహిం చాలని కేసీఆర్ నేతలకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో కేటీఆర్ తో పాటు శాసన సభాపక్ష ఉపనేత టీ.హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మండలి ఫ్లోర్ లీడర్ ఎస్. మధుసూదనరెడ్డి చారీ, ఉపనేతలు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , బండ ప్రకాష్ ముదిరాజ్ , జోగినపల్లి సంతోష్ కుమార్, ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, టి. జీవన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయ కులు సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితు లుగా కేఆర్ సురేష్ రెడ్డి, మహమ్మద్ అలీ, మారేది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here