- జనగామ ప్రజల ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారుల అడ్డంకులు తొలగించాలని ఆదేశాలు
- మట్టి తరలింపుపై కేసులు నమోదు చేయొద్దని కలెక్టర్ కు మంత్రి ఆదేశాలు
హైదరాబాద్:
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల పథకం, రెవెన్యూ వ్యవహారాలపై హైదరాబాద్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని జనగామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ స్టేట్ హోసింగ్ కార్పొరేషన్ భవనం(telagana state housing corporation)లో శుక్రవారం జరిగిన సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , దనసరి అనసూయ సీతక్క , కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకు నే పేద కుటుంబాలు మట్టి, ఇసుక తరలించుకునే సమయం లో అధికారులు కేసులు నమోదు చేయడం, చలాన్లు విధిం చడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశంలో గట్టిగా ప్రస్తావించారు. పేదల ఇళ్ల నిర్మా ణానికి అడ్డంకులు సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా గోదావరి కృష్ణ నదుల నుంచి ఇసుక తెచ్చుకుని స్థానికంగా ట్రాక్టర్ల ద్వారా పంచుకొని ఇళ్లు నిర్మించుకుం టున్న పేదలపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మొత్తానికి జనగామ ప్రజల సమస్యను వివరంగా వినిపించి, వెంటనే నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ఈ అంశంపై ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ప్రస్తావనకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం కోసం మట్టి లేదా ఇతర సామగ్రి తరలించుకునే లబ్ధిదారులపై కేసు లు నమోదు చేయవద్దని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు స్పష్టం చేశారు.

















