12.5 C
London
Saturday, June 13, 2026
Home తెలంగాణ దేవాదులపై పల్లా గర్జన!

దేవాదులపై పల్లా గర్జన!

0
  • జనగామ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా….!
  • దేవాదుల సమీక్షలో జనగామ సాగునీటి సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • జనగామ సాగునీటి సమస్యలను మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
  • చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రతిపాదనలతో పాటు పెండింగ్ పనులపై వినతి
  • అసంపూర్తి కాలువ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరిన పల్లా
  • భూసేకరణ పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • చివరి ఆయకట్టుకు గోదావరి నీరు అందించాలని విజ్ఞప్తి
  • బొమ్మకూరు కుడి కాలువ సమస్య పరిష్కరించాలని వినతి
  • అడ్డంకులు తొలగించి పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ
  • రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తా

                జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం నిర్వహించిన దేవాదుల ప్రాజెక్టు పురోగతి సమీక్షా సమావేశంలో జనగా మ నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి సమస్య లను ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి(Janagama Mla )రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెంది న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేవా దుల ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, రైతుల కు నీటి సరఫరా పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటి అవసరాలు, భూసేకరణ సమస్యలు, కాలువల నిర్మాణంలో జాప్యం, చివరి ఆయకట్టుకు నీటి అందుబాటు వంటి అంశాలపై సమగ్ర వినతిపత్రాన్ని(Representation)మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంద జేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

అసంపూర్తి కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్:
దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3 పరిధిలోని ప్యాకేజీ-8 కింద ఉన్న తపాస్‌పల్లి, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ల పరిధిలో కాలువల నిర్మాణ పనులు చాలా కాలంగా నిలిచిపోయా యని ఎమ్మెల్యే ప్రస్తావించారు. పనులు ఆగిపోవడంతో వందలాది ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. ఈ పనులను తక్షణమే పునఃప్రారంభించి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికా రులను కోరారు.
భూసేకరణ పరిహారం వెంటనే విడుదల చేయాలి:
కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ పరిహారం అందలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. పెండింగ్ పరిహారం మొత్తాన్ని వెంటనే విడుదల చేసి బాధిత రైతులకు చెల్లించాలని స్పష్టం చేశా రు.
చివరి ఎకరా వరకు గోదావరి నీరు అందించాలి:
జనగామ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి, ముఖ్యంగా చివరి ఆయకట్టులోని భూములకు కూడా గోదావరి నీరు చేరేలా పంపిణీ కాల్వల పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరా  రు. మధ్యలో పనులు నిలిచిపోవడం వల్ల కొంత ప్రాంతానికే నీరు చేరుతోందని, చివరి ప్రాంత రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచర  ణ రూపొందించాలని సూచించారు.
బొమ్మకూరు కుడి కాలువ సమస్య పరిష్కరించాలి:
నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో బొమ్మకూరు కుడి కాలు వ ద్వారా సాగునీరు సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే సమావేశంలో ప్రస్తావించారు. కాలువలో సాంకేతిక లోపాలు, నిర్వహణ సమస్యల కారణంగా రైతులకు నష్టం జరుగుతోం దని తెలిపారు. దీనిపై ప్రత్యేక పరిశీలన చేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు:
జనగామ నియోజకవర్గంలో సాగునీటి వనరుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు కోసం పలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రతిపాదనలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

  • లింగాపూర్ పెద్దవాగుపై చెక్‌డ్యామ్ పునరుద్ధరణకు రూ.3.39 కోట్ల ప్రతిపాదనను మంత్రి దృష్టికి తీసుకె ళ్లారు.
  • అలాగే కొత్త దొమ్మాట గ్రామంలో కొత్త చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.2.80 కోట్లు, ధూల్మిట్ట సమీపంలో మరో చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.4.26 కోట్లు గతంలోనే మంజూరయ్యాయని, అయినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని ఎమ్మెల్యే ప్రస్తావించారు.
  • రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే పనులు ప్రారంభిం చాలని కోరారు. ఈ పనులు పూర్తైతే సాగునీరు, తాగునీ టి సమస్యలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి రైతులకు దీర్ఘకాల ప్రయోజనం కలుగుతుందని తెలిపా రు.

సానుకూలంగా స్పందించిన మంత్రి:
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్యాకేజీ ల వారీగా పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించి అడ్డంకు లను తొలగిస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం విడు దలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, అసంపూ  ర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. చెక్‌డ్యామ్ ప్రతిపాదనలపై సాంకేతిక పరిశీలన పూర్తి చేసి అవసరమైన చర్యలు చేపడతామని అధికారులను ఆదేశిం చారు.

రైతుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది:
జనగామ నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించడం తన ప్రాధాన్య కర్తవ్యమని జనగామ ఎమ్మెల్యే పల్లా తెలిపా రు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి రైతు పొలానికి నీరు చేరే వరకు తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలని, పెండింగ్ పరిహారం వెంటనే చెల్లించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృ  ద్ధి కోసం అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్తూ పరిష్కారం సాధిస్తామని స్పష్టం చేశారు. జనగామ రైతుల హక్కుల కోసం ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here