- కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
నర్సంపేట:
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయ కులు స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు(For the memorial meeting of Peddi Sudarshan Reddy) సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు(BRS Working President KTR, BRS Deputy Leader Harish Rao) తో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజర య్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సహచరుడిగా, ప్రజా నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
సంతాప సభలో పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా సాగిన పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నర్సంపేట ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు, నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన శాశ్వత అభి వృద్ధి పనులపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ ప్రస్థానం, ప్రజాసేవ, నర్సంపేట ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ డాక్యుమెంటరీ పలువురిని కంటతడి పెట్టించింది..
పెద్ది సుదర్శన్ రెడ్డి నాకు ఉద్యమ సహచరుడు మాత్రమే కాదు..ఆత్మీయ సోదరుడు:ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న అనుబంధం మాటల్లో చెప్ప లేనిదని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నర్సంపేట ప్రజల కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, తెలం గాణ కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీ యమని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజ కవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ఆశయాలు, ఆయన పోరాట స్ఫూర్తి, ప్రజాసేవా మార్గం మనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని పల్లా రాజే శ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

















