26.8 C
London
Monday, August 10, 2026
Home తెలంగాణ తెలంగాణ ఉద్యమ సాధకుడిని చూడాలనే ఆరాటం..!

తెలంగాణ ఉద్యమ సాధకుడిని చూడాలనే ఆరాటం..!

0
  • గడప గడపకు కదిలిన జనహృదయాలు..కేసీఆర్‌ కోసం బారులు తీరిన ప్రజలు
  • ఎర్రవెల్లి నుంచి నల్లబెల్లి వరకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం
  • కేసీఆర్‌ తాత వస్తున్నాడు అంటూ చిన్నారుల ఆప్యాయ పలకరింపు
  • నా బిడ్డ వస్తున్నాడు..ఒక్కసారి చూడాలి అంటూ ముసలవ్వల ఎదురుచూపు
  • పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ..మీకు మేమున్నాం అంటూ భరోసా

జనగామ:

ఎర్రవెల్లి నుంచి పెద్దసారు ప్రయాణం మొదలైంది..కానీ అది కేవలం ఒక నాయకుడి ప్రయాణం కాదు..తెలంగాణ ఉద్య మాన్ని గెలిపించిన మహానేతను చూడాలనే ప్రజల ప్రేమ ప్రయాణం. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిని తమ ఇంటి మనిషిగా భావించే ప్రజల ఆత్మీయ ప్రయాణం.

కేసీఆర్‌ ప్రయాణం సాగుతున్న ప్రతిచోటా ప్రజలు అడుగడు గునా తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు రోడ్ల పైకి వచ్చి ఆప్యాయంగా పల కరించారు. ‘కేసీఆర్‌ తాత వస్తున్నాడు(‘Grandpa KCR is coming’)అంటూ చిన్నారులు సంబరపడుతుంటే.. ‘మన కేసీఆర్‌ వస్తున్నాడు’ అంటూ పెద్దలు ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఎక్కడ చూసినా ఒకటే సందడి..ఎక్కడ చూసినా ఒకటే ఆత్మీయత..కేసీఆర్‌ను చూడాలనే ఆరాటంతో గడప గడప నుంచి జనహృదయాలు కదిలివచ్చాయి.

యువతలో మళ్లీ కనిపించిన ఉద్యమ జోష్‌ :

తెలంగాణ ఉద్యమ సమయంలో రోడ్లపైకి వచ్చి పోరాడిన యువతే..ఈరోజు అదే ఉద్యమ నాయకుడిని చూసేందుకు రోడ్లపైకి రావడం ప్రత్యేకంగా కనిపించింది. మన తెలంగాణ జాతిపితకు జైజైలు పలకాలి అంటూ యువత నినదిం చింది. ఆ దృశ్యాలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజుల జ్ఞాపకాలు మరోసారి కళ్లముందు కదలాడాయి.

ఒకప్పుడు తెలంగాణ కోసం నినదించిన గొంతులే..ఈరోజు తమ ఉద్యమ నాయకుడి కోసం జైకొడుతున్నాయి. ఉద్య మానికి నాయకత్వం వహించిన వ్యక్తిపై ఉన్న అభిమానం, అనుబంధం ఏ స్థాయిలో ఉందో ఈ స్వాగతం చాటిచెప్పిం ది.

ముసలవ్వల కళ్లలో ఆనందభాష్పాలు:

నా బిడ్డ వస్తున్నాడు..ఒక్కసారి చూడాలి అంటూ ఎదురు చూసిన ముసలవ్వల మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి.

ఆ కళ్లలో రాజకీయాలు లేవు..పదవుల కోరిక లేదు.. ఉన్న దల్లా ఒక్కటే..అనుబంధం..ఆప్యాయత..నమ్మకం కనిపిం చింది. కేసీఆర్‌ కేవలం ఒక నాయకుడు కాదని..తెలంగాణ ప్రజల కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయారని ఈ దృశ్యాలు మరోసారి నిరూపించాయి.

బీఆర్ఎస్‌ శ్రేణులకు కేసీఆర్‌ అంటే భరోసా..

ప్రజలకు కేసీఆర్‌ అంటే నమ్మకం..

తెలంగాణకు కేసీఆర్‌ అంటే ఒక చరిత్ర..

ఉద్యమానికి కేసీఆర్‌ అంటే ఒక శక్తి..

తెలంగాణ కోసం వెనక్కి తగ్గని నాయకుడు :

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవమానాలు ఎదురైనా.. ఎన్నో అడ్డంకులు వచ్చినా..ఎన్ని కష్టాలు ఎదు రైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన నాయకుడు కేసీఆర్‌..

తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఉద్యమాన్ని ముందుకు నడిపిన ఉద్యమ సాధకుడిని చూడాలనే ఆరాటం ఈరోజు ప్రతి గుండెలో కనిపిం చింది.

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ :

ఎర్రవెల్లి నుంచి నేరుగా నల్లబెల్లి చేరుకున్న కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమ సీనియర్‌ నేత, స్వర్గీయ పెద్ది సుదర్శ న్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యాన్ని అందించారు.

మీకు మేమున్నాం..మీ కుటుంబం ఒంటరి కాదు.. బీఆర్ఎ స్‌ కుటుం బం మొత్తం మీ వెంట ఉంది అంటూ భరోసా ఇచ్చారు. పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిం చడంతో పాటు నల్లబెల్లి గడ్డపై ఉన్న నియోజకవర్గ ప్రజలకు కూడా అండగా ఉంటాననే ధైర్యాన్ని అందించారు.

నేను ఉన్నాను..మీకు అండగా ఉంటాను..మీ కష్టసుఖాల్లో మీతోనే ఉంటాను అనే భరోసాను ప్రజలకు అందించారు.

ఇది స్వాగతం కాదు..ఉద్యమ బంధానికి ప్రతిబింబం:

కేసీఆర్‌ రాక కోసం తండాలుగా.. గ్రామాలుగా..వాడవాడలా బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కదిలివ చ్చారు.

ఇది కేవలం ఒక నాయకుడికి ఇచ్చిన స్వాగతం కాదు.. తెలంగాణ ఉద్య మ బంధానికి ప్రతిబింబం. ఈ నేలతో ఉన్న బంధం రాజకీయాలకు అతీతం..ఈ ప్రజలతో ఉన్న అనుబంధం పదవులకు అతీతం..నల్లబెల్లి గడ్డపై అడుగు పెట్టిన ప్రతిసారీ తన జీవితంలో నడిచిన ఉద్యమ బాట గుర్తుకొస్తుంది.

తెలంగాణ కోసం పోరాడిన ప్రతి గుండె..ఉద్యమం కోసం నడిచిన ప్రతి అడుగు..తెలంగాణ కోసం చిందించిన ప్రతి చుక్క చెమట..ఆత్మగౌర వం కోసం చేసిన ప్రతి పోరాటం.. ఎప్పటికీ మరువలేనివి..

ఉద్యమకారుల త్యాగాలు..ప్రజల ప్రేమే బలం:

తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను..ఉద్యమంలో వెంట నడిచిన కార్యకర్తల కష్టాలను..అండగా నిలిచిన ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం.

జై తెలంగాణ!జై కేసీఆర్‌! జై బీఆర్ఎస్‌!

పల్లా రాజేశ్వర్‌రెడ్డి (ఎమ్మెల్యే,జనగామ నియోజకవర్గం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here