- దేవస్థాన అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి
- కొమురవెల్లి సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా..
- రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి:
తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరుగాంచిన కొమురవెల్లి శ్రీ మల్లి కార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కొమురవెల్లి క్షేత్రానికి విచ్చేసే లక్ష లాది మంది భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో (Inauguration of Komuravelli Railway Station) ఆదివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా మీడియాతో మాట్లాడుతూ…
- కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణతో పాటు దేశం లోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటన్నారు.
- ముఖ్యంగా మాఘమాస జాతరలు, ప్రత్యేక పూజలు, సెలవు దినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వారికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవస రం ఎంతోకాలంగా ఉందన్నారు. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు.
- గతంలో ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతులు సకాలంలో లభించక అనేక పనులు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేయడంతో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తై ప్రజల కు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
- కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం వల్ల భక్తులకు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు కూడా ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుప డుతుందన్నారు.
- ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు.
- కొమురవెల్లి మల్లన్న క్షేత్రాన్ని దేశవ్యాప్తంగా మరింత గుర్తిం పు పొందే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టాలని సూచించారు.
- భక్తులకు అవసరమైన రహదారులు, పార్కింగ్, తాగునీరు, పారి శుద్ధ్యం, వసతి, రవాణా వంటి అన్ని మౌలిక సదుపా యాలను దశలవారీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
- కొమురవెల్లి మల్లన్న క్షేత్ర సమగ్ర అభివృద్ధి, భక్తులకు మరిం త మెరుగైన సౌకర్యాల కల్పన కోసం గతంలో కూడా పలు మార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకె ళ్లినట్లు తెలిపారు.
- జనగామ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
- రైల్వే స్టేషన్ ప్రారంభంతో కొమురవెల్లి క్షేత్రానికి దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశా భావం వ్యక్తం చేశారు.
- కొమురవెల్లి క్షేత్రాన్ని జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యా టక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ, సంబంధిత అధికారులకు ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు. భవిష్యత్తులో కూడా కొమురవెల్లి క్షేత్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.

















