23.2 C
London
Sunday, May 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామ పట్టణంలో ఎమ్మెల్యే పల్లా విస్తృత పర్యటన

జనగామ పట్టణంలో ఎమ్మెల్యే పల్లా విస్తృత పర్యటన

0
  • అభివృద్ధి పనుల పరిశీలన..అధికారులకు ఆదేశాలు
  • రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను 

           జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

జనగామ:

జనగామ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను (Development works)క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని స్మశాన వాటికల అభివృద్ధి, రైల్వే స్టేషన్ పరిస రాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ సంబంధిత అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు.

పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే పల్లా ముందుగా నెహ్రూ పార్క్ సమీపంలోని స్మశాన వాటికను సందర్శించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనుల పురోగతిపై మున్సిపల్ కమిషనర్‌ను అడిగి తెలుసుకుని, పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే 29వ వార్డులోని స్మశాన వాటిక సమస్యపై ఎమ్మెల్యే స్పందించారు. అక్కడ స్థల లభ్యతను బట్టి ప్రజలకు ఉప యోగపడేలా పార్కు లేదా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసే అవ కాశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు తెలిపారు.

అనంతరం జనగామ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరు గుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీ లించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు.

జనగామ స్టేషన్‌లో కొన్ని ముఖ్యమైన రైళ్లు ఆగకపోవడం, రైళ్లు సమ యానికి రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిం చారు. రైళ్ల స్టాపేజీలు, సమయ పాలనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రైల్వే జనరల్ మేనేజర్‌కు ప్రత్యేక వినతిపత్రం అందజేస్తానని తెలిపారు.

జనగామలో మరిన్ని రైళ్ల స్టాపేజీల కోసం గట్టిగా కృషి చేస్తా నని, ప్రయా ణికుల సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here