- ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే కాంగ్రెస్ లక్ష్యం
- సింగరేణి అవినీతిని ప్రశ్నించినందుకే సుమన్‌పై కేసులు
- ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
- కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు ఒక న్యాయం..బీఆర్ఎస్ నేతలకు మరో న్యాయమా?
- బాల్క సుమన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును (Balka suman Areest) జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షసాధింపు రాజకీయా లకు పాల్పడుతూ, ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని శనివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల రూపాయల అవినీ తి, కార్మికులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రశ్నించినందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి బాల్క సుమన్ ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
సింగరేణి కార్మికుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో సుమన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు కావాలనే వక్రీకరిం చి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించారని విమ ర్శించారు. కేవలం వ్యాఖ్యల ఆధారంగా ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మంత్రు లు, ఎమ్మె ల్యేలు, నాయకులు బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకో కపోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రతిపక్ష నేతలపై మాత్రమే కేసులు పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నాయకులను అక్రమంగా జైలుకు పంపించే ప్రయ త్నం చేస్తోందని, ప్రజా స్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే బాల్క సుమన్‌పై నమోదు చేసిన కేసుల ను ఉపసంహరించుకొని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

















