17.4 C
London
Thursday, July 16, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

SIR ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

0
  • ఓటు హక్కు కాపాడుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత
  • రైతు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోంది
  • ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
  • రైతుల పంటల ఎంపికపై ఆంక్షలు సరికావు
  • గ్రామగ్రామాన కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై చర్చ జరగాలి
  • ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఓటు రక్షణే లక్ష్యం
  • కేసీఆర్ హయాంలో రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్
  • బూత్ స్థాయి కమిటీలతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం

                               జనగామ ఎమ్మెల్యే, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హన్మకొండ:

వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన SIR (సభ్యత్వ నమోదు శిక్షణ తరగతులు Membership Registration Training classses)కార్యక్రమానికి బీఆ ర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జనగా మ ఎమ్మెల్యే, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జ్ డాక్ట ర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియో జకవర్గంలో పార్టీ బలోపేతం, రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూ హం మరియు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా నాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మె ల్యే ఆరూరి రమేష్ అధ్యక్షతన జనగామ ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు.

ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొత్తగా వచ్చిన ‘SIR’ విధానం ద్వారా ఓట్లన్నింటినీ సరిచూస్తున్నారు. ఎవరి ఓటైనా తొల గించబడిందా, చనిపోయిన వారి వివ రాలు ఉన్నాయా, డబుల్ ఓట్లు ఉన్నాయా అనేది చెక్ చేస్తున్నారు. గ్రామంలో ఓటు లేకపోతే మనిషి బతికు న్నా చనిపోయిన వారితో సమానంగా చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ BL1, BL2ల వెంటపడి ఓటు ఉండేలా చూసుకోవాలి.
  • గత కేసీఆర్ ప్రభుత్వం రైతులు ఏ పంట పండించినా మొత్తం కొను గోలు చేసింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభు త్వం అత్యంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఏ పంటలు వేయమంటుందో, ఎంత కొనుగోలు చేయమం టుందో అంత మాత్రమే చేస్తామని చెబుతోంది.
  • జనవరిలో కేవలం 8 రకాల సన్న వడ్లనే సాగు చేయా లని జీవో ఇచ్చి, బడ్జెట్ సమావేశాల్లో 33 రకాలు అని చెప్పి, ఇప్పుడు మళ్లీ 7 రకాలకే పరిమితం చేశారు. ప్రభుత్వం సూచిస్తున్న ఆ 7 రకాల విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు. రైతులు తమ భూసారాన్ని బట్టి నచ్చిన పంట వేసుకునే స్వేచ్ఛ ఉండాలి.
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రూ.29,00 0 కోట్ల రుణమాఫీ బాకీని ఇంకా ఇవ్వలేదు. 2024 వానాకాలం రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టారు. 2025 లో 3 ఎకరాల లోపు, 2026లో కేవలం 2 ఎకరాల లోపు ఉన్నవారికే వేశారు. ఇకపై ఏడాదికి రెండు విడతలు కాకుండా ఒక్క విడతే ఇస్తామని కొత్త నిర్ణయం తీసుకున్నారు.
  • గతంలో ఎన్నికల ముందు ప్రతి గింజనూ కొంటామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పిన పంటలనే కొంటామని ఎలా అంటారు? ఆయన ఏ విధం గా పండిన పంట అంతా కొనుగోలు చేస్తారో సమాధా నం చెప్పాలని గ్రామగ్రామాన మనం చర్చ పెట్టాలి.. ప్రభుత్వాన్ని నిలదీయాలి.
  • కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి హడావుడి, ప్రకటనలు లేకుండానే 11 విడతలుగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.72,000 కోట్లు వేశారు. పంట కొన్న వారం రోజుల లోపలే రైతుల ఖాతాల్లో డబ్బులు ఎలా జమ చేశార నే విషయాన్ని కచ్చితంగా ప్రతి గ్రామంలోనూ, రైతుల మధ్యలోనూ చర్చకు పెట్టాలి.
  • త్వరలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలి. బూత్ వైస్‌గా కొత్త కమిటీలు వేసుకో బోతున్నాం. బూత్ స్థాయి మెంబర్‌షిప్ ఇన్‌చార్జుల ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి.
  • ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘SIR’ ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలి.
  • ప్రతి గ్రామంలో, వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపై ఉంది.
  • కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. విత్తనాల ఎంపికపై ఆంక్షలు విధిస్తూ జీవోల వెనుక పెద్ద కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుంది.
  • త్వరలోనే బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేసి సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here