18 C
London
Monday, August 31, 2026
Home ప్రత్యేక కథనాలు నాన్నే నా వెలుగు..నాన్నే నా గెలుపు!

నాన్నే నా వెలుగు..నాన్నే నా గెలుపు!

0
  • నాన్నే నా వెలుగు..నాన్నే నా గెలుపు!
  • సోడేశపల్లి మట్టిలో నాటిన బీజం నేను..
  • నాన్న చమట చుక్కల్లో తడిసిన ప్రాణం నేను!
  • పైకి కనిపించే క్రమశిక్షణే ఆయన రూపం..
  • లోపల దాచుకున్న కొండంత ప్రేమే నా కోట గోడ!
  • కష్టాలెన్ని ఎదురైనా భయపడకు అన్నాడు..
  • పల్లెటూరి మూలాలను ఎన్నడూ మరువకు అన్నాడు.
  • చదువే పేదరికాన్ని తుడిచేసే ఆయుధమని నాన్న చెబితే..
  • అక్షరాల ఆలయాలుగా నా కళాశాలలను నిలబెట్టాను!
  • లక్షలాది బిడ్డల భవితకు విద్యాసంస్థల వేదికనయ్యాను!
  • నలుగురికీ సాయపడమనే నాన్న ఆశయమే..
  • ఈనాడు జనగామ జనసేవలో నా నడకకు ఊపిరి!
  • నాన్న భౌతికంగా దూరమైనా.. నా ఆలోచనల్లో ఉన్నాడు.
  • ప్రతీ అడుగులో నా వెన్నుతట్టి నడిపిస్తున్నాడు.
  • నాన్నే నా ధైర్యం.. నాన్నే నా మార్గం..
  • ఆయన అడుగుజాడల్లో నడవడమే నా జీవిత పరమార్థం!

జనగామ నియోజకవర్గ ప్రజలందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు.. (HAPPY FATHERS DAY)

తండ్రి ప్రేమ, ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తూ…

మీ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

(శ్రీ కీర్తిశేషులు నా తండ్రిగారు పల్లా రాఘవ రెడ్డి గారి స్మృతులతో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here