- లింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
- ముఖ్యఅతిధిగా పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే పల్లా
బచ్చన్నపేట:
బచ్చన్న పేట మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం (నరేగా) నిధుల నుంచి రూ.12 లక్షల వ్య యంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు(CC ROADS WORKS) పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించా రు.ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(PALLA RAJESWER REDDY) ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్:
- గ్రామీణ ప్రాంతాల సర్వాంగీణ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
- ప్రతి గ్రామానికి బీటీ, సీసీ రోడ్ల సౌకర్యం కల్పించి, మౌలిక వసతులను మెరుగుపరచడమే మా ప్రాధాన్యత. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత లేకుండా చూస్తాం.
- పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు పేర్కొన్నారు.

















