- మహిళా సాధికారతే గ్రామాభివృద్ధికి పునాది
- గ్రామాల అభివృద్ధే లక్ష్యం..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
- ఐకేపీ ధాన్యం సేకరణలో వడ్లకొండ ఆదర్శ గ్రామం
- వడ్లకొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు(For many development programs) బుధవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy) శ్రీకారం చుట్టారు. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం నిర్మించనున్న నూతన భవనానికి ఆయన భూమిపూజ చేసి నిర్మాణ పను లను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ...
- మహిళా సాధికారతే గ్రామాభివృద్ధికి బలమైన పునాది. గ్రామంలో 125 మహిళా స్వయం సహాయక సంఘాలు, మూడు గ్రామ సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తూ మహి ళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని కొనియా డారు.
- మహిళా సంఘాలకు ప్రత్యేక భవనం అందుబాటులోకి రావ డం ద్వారా వారి కార్యకలాపాలు మరింత విస్తృతంగా సాగు తాయి.
- గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ ఏడాది అత్యుత్తమంగా పనిచేసింది. దాదాపు 80 లారీలకు పైగా ధాన్యం సేకరణ జరగ డం విశేషమని, మండలంలోనే అత్య ధిక ధాన్యం సేకరణ వడ్లకొండలో నమోదవడం గ్రామ ప్రజల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
- ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభి వృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
- గ్రామాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజాప్రతిని ధులు, యువత, మహిళలు కలిసి పనిచేయడం అభినంద నీయమం.
- ముఖ్యంగా గ్రామంలోని తొమ్మిది బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిం చి అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయ డం ప్రశంసనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో వడ్లకొం డను రాష్ట్రానికే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- వడ్లకొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పంచా యతీ, సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే అభినందించారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 80 మంది విద్యా ర్థులను చేర్పించడం మంచి నిర్ణయం. అలాగే గ్రామంలో శాంతిభ ద్రతలను మరింత బలోపేతం చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుంది.
- గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రతి కార్యక్రమానికి తన పూర్తి సహకా రం ఉంటుంది. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

















