- నాలుగు మండలాలకు నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణానికి రూ.9 కోట్ల పరిపాలనా అనుమతి
జనగామ:
జనగామ నియోజకవర్గంలో రెవెన్యూ పరిపాలనను మరిం త ఆధునికీకరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశ గా మరో కీలక ముందడుగు పడింది. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA PALLA RAJESWER REDDY)అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు, తదనంతరం ప్రభుత్వంతో సాగించిన సమన్వయ ఫలితం గా తరిగొప్పుల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండల కేంద్రాల్లో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మా ణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
ఈ నాలుగు మండలాల్లో ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయా లు అద్దె భవనాల్లో లేదా శిథిలావస్థలో కొనసాగుతున్న నేప థ్యంలో ప్రజలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పలుమార్లు రాష్ట్ర ప్రభు త్వ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత శాఖ మంత్రి, ఉన్నతాధి కారులతో వరుస సమావేశాలు నిర్వహించి, ప్రతిపాదనలు సమర్పించడం ద్వారా ఈ అంశాన్ని నిరంతరం ప్రభుత్వ దృష్టిలో ఉంచారు.
ఆయన ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెవె న్యూ శాఖ ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేయ డంతో పాటు నిధులను కూడా మంజూరు చేసింది. నాలుగు మండలాల్లో ఒక్కో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణా నికి రూ.2.25 కోట్ల చొప్పున మొత్తం రూ.9 కోట్లు కేటాయిం చింది.
మొత్తంగా నూతన భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా అందడంతో పాటు ఉద్యోగులకు కూడా మెరుగైన పని వాతావరణం ఏర్పడనుంది. జనగామ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరంతరం చేస్తున్న కృషికి ఈ పరిపాలనా అనుమతి మరో నిదర్శనమని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

















