16.2 C
London
Tuesday, September 1, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ అంతిమయాత్రలో చివరి వరకు నిలిచి ఆత్మీయత చాటిన ఎమ్మెల్యే.. 

అంతిమయాత్రలో చివరి వరకు నిలిచి ఆత్మీయత చాటిన ఎమ్మెల్యే.. 

0
  • మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ తండ్రి హేమ్లా నాయక్ మృతి 
  • హేమ్లా నాయక్ పాడెను భుజాన మోసిన రాజేశ్వర్ రెడ్డి 

నర్మెట్ట:

నర్మెట్ట మండలం మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ తండ్రి తేజావత్ హేమ్లా నాయక్(HEMLA NAYAK) మృతి పట్ల జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAG AMA MLA PALLA) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురు  వారం హేమ్లా నాయక్ నివాసానికి ఎమ్మెల్యే చేరుకొని వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అంతటితో తన బాధ్యత ముగిసిందని భావించకుండా అంతిమ యాత్రలో చివరి వరకు కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే కలిసి నడిచారు. హేమ్లా నాయక్ పాడెను స్వయం గా భుజాన మోసి తన ఆత్మీయ తను చాటిచెప్పారు. పదవితో కాదు…బంధంతో ప్రజల మధ్య నిలిచే నాయకుడే నిజమైన ప్రజానేత అనే విషయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి తన ఆచరణతో నిరూపించారు.

అనంతరం హేమ్లా నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరా లని ఎమ్మెల్యే ప్రార్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here