15.9 C
London
Friday, October 9, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?

0
  • 1000 రోజుల పాలనలో హామీల అమలు ఎక్కడ?
  • హామీలు బాకీలుగా మార్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డుతో బీఆర్‌ఎస్ ఉద్యమం
  • రైతు నుంచి యువత వరకు…ప్రతి వర్గానికీ కాంగ్రెస్ బాకీ
  • హామీలు ఇచ్చి మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
  • మహిళలు, రైతులు, విద్యార్థులు…అందరికీ నెరవేరని హామీలు
  • సాగునీరు, ఉద్యోగాలు, పెన్షన్లు…కాంగ్రెస్ వైఫల్యాలపై పల్లా ధ్వజం
  • సెప్టెంబర్ 3 నుంచి జనగామలో వరుస బాకీ కార్డు కార్యక్రమాలు
  • ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

జనగామ:

జనగామ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (MLA CAMP OFFICE) బుధవారం రేవంత్ రెడ్డి నేతృ త్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన వైఫ ల్యాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావే  శంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAGAMA MLA ) హాజరై మాట్లాడారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:

  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారెం టీలు, 420 హామీలు, హామీ పత్రాలు, అఫిడవిట్‌ల ద్వారా ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్నా వాటిలో చాలా వరకు అమలు కాలేదు.
  • ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల  కు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను ట్యాబ్‌ లో ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ కార్యక ర్తలు, విలేకరులకు వివరించారు.
  • ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్ని  స్తున్న ప్రజలు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడం సరికాదు.
  • గతంలో ఎకరానికి రూ.10 వేలుగా ఉన్న రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని వరంగ ల్ రైతు డిక్లరే  షన్‌లో స్పష్టంగా ప్రకటించారని తెలిపారు.
  • రైతుబంధు కింద రూ.15 వేలు ఇవ్వడంతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు.
  • రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, చెప్పిన స్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.
  • రైతు బీమా కింద రూ.5 లక్షల రక్షణ కల్పిస్తామని, రైతు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి రైతు బీమా ప్రీమియం చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
  • వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అంది స్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయ  లేదని విమర్శించారు.
  • పంటలకు పంట బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడి దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్నా పంట బీమాపై స్పష్టమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
  • పంట నష్టపోయిన రైతులకు గతంలో ఎకరానికి రూ.10 వేల వరకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించామని గుర్తుచేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకో వడంలో విఫలమైందని ఆరోపించారు.
  • రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
  • వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
  • రైతులకు బోనస్ విషయంలో కూడా స్పష్టత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

  • మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తా మని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు.
  • మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పి అమలు చేయ లేదని విమర్శించారు.
  • కళ్యాణలక్ష్మి కింద రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు.
  • గత ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణలక్ష్మి పథకాన్నే నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.

పెన్షన్ హామీ ఏమైంది?

  • వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
  • గతంలో ఉన్న రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు.
  • కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పినా, కొత్త పెన్షన్ల మంజూరులో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here