- గుడిసెల్లో నివసించే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
- అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందాలి
- వైద్య సమస్యలపై వెంటనే సమాచారం ఇవ్వాలి
- అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- అక్కరాజుపల్లిలో విఓ, అంగన్‌వాడీ భవనాలకు శంకుస్థాపన
- ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తరిగొప్పుల:
తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామంలో మహి ళా సంఘ భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణ పనులకు (Construction work for Mahila Sangha building and Anganwadi center) సోమవారం జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకు స్థాపన చేశారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల ఆధ్వ ర్యంలో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియా పాయింట్స్:
- అక్కరాజుపల్లి గ్రామంలో సుమారు రూ.22 లక్షల అంచనా వ్యయంతో మహిళా సంఘ భవనం, అంగన్‌వాడీ కేంద్రం నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో మెటీరియల్ కాంపో నెంట్‌ను కలిపి ఈ భవనాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి మూడు నెలల్లోగా పూర్తి చేయా లని సర్పంచ్, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తయితే నిధుల విడతలు కూడా త్వరగా విడుదలవుతాయని తెలిపారు.
- ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియ కొనసాగు తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూ రైతే, అందులో 500 ఇళ్లను పూర్తిగా గుడిసె ల్లో నివసిస్తున్న నిరుపేదలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
- 2014కు ముందు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పిల్లర్లు, బేస్‌మెంట్ లేదా స్లాబ్ స్థాయిలో అసంపూర్తిగా నిలిచిపో యిన ఇళ్లను కూడా గుర్తించాలని సూచించారు. అర్హత ఉన్న పాత అసంపూర్తి ఇళ్లకు ప్రస్తుత పథకం ద్వారా రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సాయం అం దించే అవకాశం ఉందన్నారు.
- గ్రామంలోని పాత అసంపూర్తి ఇళ్ల వివరాలతో జాబితాను సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించాలని సర్పంచ్, స్థానిక నాయకులకు సూచించారు. ఆ జాబితా కాపీని తనకు అందజేస్తే తదుపరి చర్యల కోసం పరి శీలిస్తానని తెలిపారు.
- అలాగే ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, బీడీ కార్మికులకు సంబంధించిన పింఛన్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చూడాలని ఎమ్మెల్యే గారు సూచించారు. అర్హత ఉన్న ఏ ఒక్క పేదవా రికి సంక్షేమ పథకాలు అందలేదనే పరిస్థితి రాకుండా సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని కోరారు.
- గ్రామస్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికైనా వైద్యం లేదా ఆస్పత్రికి సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు, మేజర్ సర్జరీలు ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైద్య సహాయం అవసరమైన వారు సమస్యను తమ దృష్టికి తీసుకురావా లని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.

















