చేర్యాల:
చేర్యాల పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాల య (KGBV) నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి అత్యం త ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను కల్పించామని గుర్తు చేసారు..
- తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్యకు అత్యంత ప్రాధాన్య త ఇవ్వాలి. బాలికల విద్య కుటుంబానికే కాదు, సమాజ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు.
- చదువే జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధం. విద్యార్థినులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలి.
- ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బాలికలు కూడా ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరో హించాలని కోరారు.

















