- ఆకునూర్లో ఐదు స్వయం సహాయక బృందాల వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
చేర్యాల మండలం ఆకునూర్ గ్రామంలో నిర్మించిన ఐదు స్వయం సహాయక బృందాల (వీఓ) భవనాన్ని(The building for five self-help groups Village Organ izations)జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి, పొదుపు సంస్కృ తిని బలోపేతం చేయడంలో స్వయం సహాయక బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
- మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబంతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.
- గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడంలో స్వయం సహాయక బృందాల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. మహిళల ఐక్యత, క్రమశిక్షణ, పొదుపు అలవాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.
- మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాల ను కల్పించడం ద్వారా వారి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయయి.
- వీఓ భవనం అందుబాటులోకి రావడంతో స్వయం సహా యక బృందాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, పొదు పు, రుణాల నిర్వహణతో పాటు ఇతర ఆర్థిక కార్యకలా పాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
- మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

















