- మత్స్యకారులు, ముదిరాజ్ కులస్థుల ఆర్థికాభివృద్ధికి సహకార సంఘాలు దోహదపడుతాయి.
- 500 మంది సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ
- ప్రమాణిత విత్తనాలు, నాణ్యమైన ఎరువులతో అధిక దిగుబడులు సాధించాలి.
- చిన్నారుల సంక్షేమానికి అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చాలా కీలకం
- కొమురవెల్లిలో విత్తన, ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి:
కొమురవెల్లి మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం కార్యా లయంలో ఏర్పాటు చేసిన కొండపాక ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (Kondapaka Fisheries Producer Company Limited) ఆధ్వర్యంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాన్ని శుక్రవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కొమురవెల్లిలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండటం వ్యవసాయాభివృద్ధికి ఎంతో అవసరం.
- మత్స్యకారులు, ముదిరాజ్ కులస్థుల ఆర్థికాభివృద్ధి కోసం ఇలాంటి సహకార సంఘాల ద్వారా చేపడుతున్న కార్యక్ర మాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
- ఈ విత్తనాలు, ఎరువుల దుకాణం ద్వారా సుమారు 500 మంది సభ్యులకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వారు ఆర్థికంగా బలోపేతం అవు తారు.
- రైతులు తప్పనిసరిగా ప్రమాణిత విత్తనాలు, నాణ్యమైన ఎరువు లనే వినియోగించి అధిక దిగుబడులు సాధించా లని సూచించారు. రైతులకు అవసరమైన సేవలను అందించడంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
- ఈ సందర్భంగా కొండపాక ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ కమిటీ సభ్యులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, మత్స్య కారులను ఎమ్మెల్యే అభినందించారు.
- అనంతరం కొమురవెల్లిలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసి మాట్లాడారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం అవసరం..
- ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన భవనాలతో చిన్నారులకు సురక్షిత మైన, పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందుబాటులోకి వస్తాయి. అనంతరం నిర్మాణ పనులు నాణ్యతతోపాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు.

















