- నేడు జ్ఞాపకాలుగా మిగిలిపోయింది
- నా చెల్లె సరితా అంటే నాకు ఆత్మీయ అనుబంధం…
- సరితా రెడ్డి సంవత్సరీక కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే పల్లా
వేలేరు:
వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ, దివంగత కీ.శే. చాడ సరితా రెడ్డి సంవత్సరీక కార్యక్రమానికి(For Chada Saritha Reddy’s first dea th anniversary ceremony)శనివారం జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సరితా రెడ్డితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గుర య్యారు.
ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:
- సరితా నాకు రాజకీయాల్లో పరిచయమైన వ్యక్తి కాదు.. .నా చెల్లెలు..తనకు ఏ కష్టం వచ్చినా ముందుగా నాతో నే పంచుకునేది.
- నాకు ఏ కార్యక్రమం ఉన్నా అది తన ఇంటి కార్య క్రమంలా భావించి ముందుండి అన్ని బాధ్యతలు తీసుకునేది. నా ఆనందంలో ఆనందప డేది..నా బాధ లో బాధపడేది. ఇంత చిన్న వయసులో మనందరినీ విడిచి వెళ్లిపోవడం ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను.
- ఆమె జ్ఞాపకాలు ప్రతిరోజూ నన్ను వెంటాడుతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
- సరితా రెడ్డి ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆమెకున్న అంకితభావం చిరకాలం ప్రజల హృదయాల్లో నిలిచి పోతాయి.
- అనంతరం సరితా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

















