26.8 C
London
Monday, August 10, 2026
Home అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

0
  • జనగామ వైద్య రంగానికి అన్ని వసతులు కల్పించాలి
  • ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై మంత్రి సమక్షంలో ఎమ్మెల్యే పల్లా ప్రస్తావన
  • నిధులు,సిబ్బంది,మౌలిక వసతుల కల్పనకు సమగ్ర వినతిపత్రం అందజేత
  • జనగామను వైద్య సేవల్లో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం 

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ని డా. బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో(At the Dr. B.R. Ambedkar Telangana State Secretariat in Hyderabad)ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల వైద్య, ఆరోగ్య శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిం చారు.

ఈ సమావేశంలో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(Dr. Palla Rajeshwar Reddy, MLA of Jangaon Constituency)పాల్గొని జనగామ నియోజ కవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యం తో వైద్య సేవల పరిస్థితిని సమగ్రంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా జనగామ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రి, జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ల లో ప్రస్తుతం ఉన్న వసతులు, అవసరమైన అదనపు సౌకర్యాలు, వైద్యులు మరియు సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాల కొరత, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రి తో సవివరంగా చర్చించారు.

జనగామ నియోజకవర్గ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని వసతులను కల్పించాలని కోరుతూ..సంబంధిత అంశాలపై సమగ్ర నివేదికతో కూడిన లిఖితపూర్వక వినతిపత్రాన్ని మంత్రి దామోదర్ రాజనర్సిం హకి ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి సమర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ..

ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్య సేవలు అందించాలన్నదే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నా  రు. జనగామ నియోజకవర్గ వైద్య రంగ అభివృద్ధికి అవసర మైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు, సిబ్బంది, మౌలిక వసతుల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here