- బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలను మరువొద్దు
- తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ ప్రాంతానిది కీలక పాత్ర
- సాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాటం
- గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడతా
- భూదాన్ భూమి ఆరోపణలు అవాస్తవం..2008లోనే ఎన్ఓసీ వచ్చింది
- ఎకరం 10 గుంటల భూమిని 2014లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా
- ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరంతరం పోరాడాలి
- అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారు
- మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
- రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత గత ప్రభుత్వానిదే
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం(September 17 National Integration Day)సందర్భంగా గురువారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ పతా కాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమా వేశంలో సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత, తెలంగాణ సాయుధ పోరాటం, బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలు, సాగునీరు, విద్యుత్, గిరిజన సంక్షేమం, భూ వివాదం(Bairanpally Martyrs, Telangana Armed Struggle, Irrigation, Electricity, Tribal Welfare, Land Allegations, Far mers and Public Issues)తదితర అంశాలపై ఎమ్మెల్యే పల్లా మాట్లాడారు.
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:
- 1948 సెప్టెంబర్ 17ను కొందరు విమోచన దినంగా, మరికొం దరు విలీన దినంగా పేర్కొంటారు. తెలంగాణ ఉద్యమ సమ యంలో కేసీఆర్ గారు హైదరాబాద్ సంస్థానం భారతదేశం లో విలీనమైన రోజుగా సెప్టెంబర్ 17ను పేర్కొన్న విషయా న్ని గుర్తుచేశారు. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టిన చరిత్రను వివరించా రు.
- సెప్టెంబర్ 17 సందర్భంగా జనగామ ప్రాంత ప్రజలు, నాయ కులు బైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలను గుర్తుంచుకో వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. 1948 ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటనలో 130 మంది అమరులయ్యారని పేర్కొన్నారు.
- తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మతో పాటు అనేక మంది పోరాట వీరులు భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడారని గుర్తుచేశారు. నిజాం పాల న, కాసిం రజ్వీ సేనల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు అగ్నిగుండా లుగా మారాయని పేర్కొన్నారు.
- సమ్మక్క-సారక్క ప్రాజెక్టు, 42 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా గతంలో జనగామ, చీటకోడూరు తదితర ప్రాంతాలకు సాగునీరు అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సాగునీటి సరఫరా సక్రమంగా లేదని పేర్కొ న్నారు. బొమ్మకూరు, పెద్దపహాడు ప్రాంతాల ద్వారా చెరువు లు నిండితే దిగువ ప్రాంతాలకు నీరు చేరుతుందని వివరించారు.
- నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ అందకపోవడం వల్ల సాగునీటి పంపిణీలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. జనగామ పట్టణంతో పాటు చీటకోడూరు, పరిసర గ్రామాలకు కూడా నీరు సక్రమంగా అందేలా స్థానిక నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు.
- నీరు, కరెంట్ సమస్యలు ఏర్పడినప్పుడు ప్రజలను వెంట తీసుకుని సబ్స్టేషన్లు, సంబంధిత అధికారులను ప్రశ్నించా లని పిలుపునిచ్చారు.
- గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ నాయక త్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి అమలు చేసినట్లు, 3,250 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు పేర్కొన్నారు.
- ఐటీడీఏ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అందిన నిధులను ప్రస్తావిస్తూ, గిరిజనులకు రావాల్సిన ఉద్యోగాలు, మౌలిక వసతుల కోసం ముందుండి పోరాడతానని తెలిపారు.
- తనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన భూ ఆరో పణలను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. 2008లోనే భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి ఎన్ఓసీ వచ్చిందని, కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని తెలిపారు.
- 2012లో ఒప్పందం జరిగి, 2014 జూన్‌లో ఎకరం 10 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయానికి సంబంధించి స్పీకర్‌కు లేఖ, ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
- తాను విద్యార్థి ఉద్యమాలు, వామపక్ష ఉద్యమాలు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని ప్రజా సమస్యల కోసం పోరాడినట్లు తెలిపారు. 2014 తర్వాత అధికారంలో ఉన్న సమయంలో కూడా స్వలాభం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేశానని స్పష్టం చేశారు.
- మహిళలకు రూ.2,500, పింఛన్ల పెంపు, స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం రైతులకు విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు.
- అసెంబ్లీలో నిరసన సందర్భంగా నల్ల దుస్తులు, టీషర్టులు ధరించి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లోపలికి అనుమ తించలేదని, మహిళా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
- ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.

















