- రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలకు ఇదే నిదర్శనం..!
- సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఘటన అత్యంత హేయం..
- ముఖ్యమంత్రి, హోం మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి..!
- సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలి..!
- బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ తరుపున పోరాటం ఉధృతం చేస్తాం.
- సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఘటనను తీవ్రంగా ఖండించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ :
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లోకి ఏకంగా 15 మంది ముసుగు ధరించిన గుండాలు అక్రమం గా చొరబడి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై(BRS Working Preside nt KTR on PRO Mahesh and PA Mahender Redd y) మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం పోలీ స్ స్టేషన్‌కు పిలిపించి, ఖాకీల సమక్షంలోనే వారిపై హింసకు పాల్పడడం వెనుక పెద్ద కుట్ర ఉంది.
రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులు, శాంతిభద్రతల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఈ ఘటనతో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తూ ఎవరిపై పడితే వారిపై దాడులు చేయిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మహేష్, మహేంద ర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశా లు ఇచ్చినప్పటికీ, కక్షసాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనకు ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ జోక్యానికి తావులేకుండా సిట్టింగ్ జడ్జి తో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గుండాల దాడిలో గాయపడిన పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే పూర్తి భద్రత కల్పించి, మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.
ఈ అరాచక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను.. బాధ్యు లపై వెంటనే చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా స్వామ్యబద్ధంగా తన పోరాటాన్ని ఉధృతం చేస్తుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

















