13.6 C
London
Monday, June 1, 2026
Home భక్తి ముస్త్యాలలో వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

ముస్త్యాలలో వైభవంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

0
  • గ్రామస్తులంతా సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలి 
  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 
  • భక్తులతో కిటకిటలాడిన ముస్త్యాల గ్రామం.
  • ఘనంగా స్వాగతం పలికిన నిర్వాహకులు.

చేర్యాల:

చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ (Renuka yellamma festival) పండుగ జాతర, అమ్మ  వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభ వంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్బంగా ఆయనకు గ్రామస్తులు, ఆలయ కమిటీ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మ వారిని దర్శించుకుని, అర్చకుల వేదమంత్రా ల నడుమ జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొ న్నారు.

అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: ఎమ్మెల్యే పల్లా

ముస్త్యాల గ్రామ ప్రజలపై రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గ్రామస్తు లంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here