- ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా
చేర్యాల:
చేర్యాల మండలం చుంచునకోట గ్రామంలో బీఆర్ఎస్ సీని యర్ కార్యకర్త(Brs senior leader)యాట ఆగయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. యాట ఆగయ్య తన భార్య జగతమ్మతో కలిసి బైక్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో జగతమ్మ అక్కడికక్కడే మృతి చెందా రు. ఆగయ్య గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకు న్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం వెంటనే చుంచునకోట గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

















