22.4 C
London
Saturday, May 30, 2026
Home తెలంగాణ రైతుల సమస్యలను కేటీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే పల్లా 

రైతుల సమస్యలను కేటీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే పల్లా 

0
  • మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోయాయి..!
  • నెలరోజులుగా 17 వేల క్వింటాళ్లు నిల్వ ఉన్నాయి.
  • ఒక్క గింజ కూడా కొనలేదు..
  • మొక్కజొన్న కుప్పలు పెరుగుతున్నాయి..అధికారుల పట్టింపు లేదు
  • భారదన్ లేక కొనుగోలు నిలిచింది..మహిళా రైతుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..
  • రైతుల సమస్యలను కేటీఆర్ కు వివరించిన ఎమ్మెల్యే పల్లా 

జనగామ:

జనగామ జిల్లా యశ్వంత్‌పూర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కే.టి.రామరావు మంగళవారం సంద ర్శించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి కేంద్రాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదు  ర్కొంటున్నారు. ఈ సమస్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ K. T.Rama Rao దృష్టికి జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి తీసుకెళ్లి వివరించారు.

యశ్వంత్‌పూర్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజు లు గడిచినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వద్ద సుమారు 17వేల క్వింటాళ్ల మొక్కజొ న్న కుప్పలుగా పేరుకుపోయి ఉన్నప్పటికీ, భారదన్ (బిల్లింగ్) లేకపోవ డం, గన్నీ సంచులు సరఫరా చేయకపోవడం వల్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి..నర్మేట, తరిగొప్పుల ప్రాంతాల నుంచి రైతులు అధిక ఖర్చుతో ధాన్యం తీసుకొచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తోంది. అంతకుముందు కొనుగోలు చేసిన సుమారు 13వేల క్వింటా ళ్లకు కూడా ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని రైతులు తెలి పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నదని కేటీఆర్కు  పేర్కొ న్నారు. నిడిగొండ ప్రాంతం నుంచి వచ్చిన లారీల రైతులు కూడా ఇక్కడే ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా కేటీఆర్ రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

  • మహిళా రైతు ఉపేంద్రమ్మ తనకు 6 ఎకరాలు ఉండ గా మొత్తం మొక్కజొన్న పండిం చానని, 20 రోజులుగా కేంద్రం వద్ద వేచి ఉన్నప్పటికీ కొను గోలు జరగలేదని తెలిపారు.
  • మరో రైతు విజయలక్ష్మి 3ఎకరాల్లో పండించిన పంటను 15 రోజులుగా తీసుకొచ్చి పెట్టినా ఒక్క గింజ కూడా కొనలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
  • నాగరాణి అనే రైతు 5 ఎకరాల్లో పండించిన మొక్కజొన్న 20 రోజులుగా కొనుగోలు లేకపోవడంతో వాన పడితే పంట నష్టపోతుందనే భయంతో ఉన్నామని తెలిపింది.

రైతుల సమస్యలను విన్న కేటీఆర్ వెంటనే మార్క్ ఫైడ్ ఎండీతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిం చారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని అధికా  రులను ఆదేశించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here